ఫోకస్

సంఘటిత శక్తితోనే సాధికారత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్వయంకృషితో పారిశ్రామిక, ఆర్థిక, వైద్య, సామాజిక తదితర రంగాల్లో మహిళలు ఎదగాలి. ఎవరో వస్తారు.. ఏదో చేస్తారనే ఆలోచనలకు స్వస్తి చెప్పాలి. మహిళా సాధికారత అనేది ఒకళ్లు ఇస్తే వచ్చేది కాదు. కాని మహిళలు స్వయంకృషితో ఉన్నత స్థానాలకు ఎదిగేందుకు అవసరమైన వేదికను, అవకాశాలను ప్రభుత్వాలు కల్పించాలి. అప్పుడే త్వరితగతిన మహిళలు ఉన్నత లక్ష్యాలను సాధిస్తారు. ఫిక్కీ వుమెన్ సంస్థ మహిళలకు ఉద్యోగాలను కల్పించడంలో, మహిళా వ్యాపారవేత్తలను ప్రోత్సహిచడంలో బాగా కృషి చేస్తోంది. మహిళల్లో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా ఎదగాలన్న ఆకాంక్ష ఉంటే తప్పనిసరిగా సరైన శిక్షణ ఫిక్కీ ఇస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాగా సహకరిస్తున్నాయి. మహిళా సాధికారత అనేది సుదీర్ఘ ప్రయాణం. అనేక కార్యక్రమాలు ఆ లక్ష్యసాధనకు ఉన్నాయి. వీటిని వేగవంతం చేయాలి. సాధికారం పొందడానికి ఈ ప్రయాణపు వేగాన్ని పెంచాలి. మహిళల పాత్రను సమాజం ఎటూ గుర్తిస్తుంది. సైన్స్ లేదా నాయకత్వమైనా, వ్యాపారమైనా, వైద్యం అయినా, కొత్త పరిశ్రమలు స్థాపించాలన్న ఆకాంక్ష ఉన్నా, పరిపూర్ణత సాధించే శక్తి మహిళలకు ఉంది. మనలో ఉన్న శక్తిని కనుగొని దానిని బయటకు తీయాలి. దార్శనికత, అభిరుచి ఉండాలి. అప్పుడు ఈ ప్రపంచాన్ని మనకు అనుకూలంగా మార్చుకోవచ్చు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన మహిళల నిజమైన జీవితాలు, సాహస ఘట్టాలను చదవాలి. దీనివల్ల మనలో ఉన్న పిరికితనం పోతుంది. స్పష్టమైన ప్రణాళిక ఉండాలి. ముందుగా మనకేమికావాలో నిర్దేశించుకోవాలి. ఆ దారిలో ఎదురయ్యే సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి తగిన ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. ప్రతి మహిళ సాటి మహిళకు తోడ్పాటు అందించాలి. మహిళలు ఉన్నత విద్యను అభ్యసించేందుకు ప్రభుత్వం మంచి అవకాశాలు కల్పించాలి. మహిళా సాధికారత ఉంటే ఆ సమాజం, దేశం అద్భుతమైన ప్రగతిని సాధిస్తుంది.
- డాక్టర్ సంగీతా రెడ్డి జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్, అపోలో హాస్పిటల్స్