ఫోకస్

పార్లమెంటులో మహిళా బిల్లును ఆమోదించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహిళలకు చట్టసభల్లో సరైన గౌరవం లభించడానికి కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో మహిళ సాధికారిత బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపజేయాలి. గత ప్రభుత్వాలు మహిళా బిల్లుపై సరియైన దృష్టి సారించకపోగా స్ర్తిల డిమాండ్‌ను గొంతెమ్మ కోరిగా మార్చివేశాయ. కేవలం స్థానిక సంస్థల్లో మాత్రమే మహిళలకు సగభాగం ఎన్నుకునే అవకాశం ఉన్నా, అసెంబ్లీ, పార్లమెంటులో కూడా 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే రాజకీయపరంగా స్ర్తిలు ఎదిగేందుకు దోహదపడుతుంది. తెలంగాణలో సిఎం కేసీఆర్ మహిళలకు అన్ని రంగాల్లో గుర్తింపునిస్తూ అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలుచేస్తున్నారు. ప్రధానంగా అమ్మ ఒడి, ప్రభుత్వ ఆసుపత్రుల్లో సుఖ ప్రసవాలు, కేసీఆర్ కిట్, కళ్యాణ లక్ష్మీ, షాదీముబారక్ తదితర కార్యక్రమాలను చేపడుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులపై మహిళలకు అపారమైన నమ్మకం ఏర్పడింది. ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లకుండా ప్రభుత్వ వైద్యానికి మొగ్గుచూపిస్తున్నారు. 119 అసెంబ్లీ స్థానాలకుగాను దామాషా ప్రకారంగా మహిళా మంత్రులను నియమించుకోలేకపోయాం. అయినప్పటికీ పద్మా దేవేందర్‌రెడ్డిని కీలకమైన ఉప సభాపతి బాధ్యతను అప్పగించిన కేసీఆర్ మహిళలను గౌరవించారు. పార్లమెంటులో మహిళా సాధికారిత బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించాలి. అప్పుడే మహిళలు హక్కులను సాధించుకుంటారు.

- చింతా ప్రభాకర్ సంగారెడ్డి ఎమ్మెల్యే