ఫోకస్

చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశ జనాభాలో సగభాగం మహిళలు ఉన్నప్పటికీ మహిళలు ఇంకను అన్ని రంగాల్లో వెనుకబడే ఉన్నారు. మహిళలు సాధికారత సాధించేందుకు ప్రభుత్వం ఇస్తున్న తోడ్పాటును అందుకునేందుకు అవకాశాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. ఈ పరిస్థితిని అధిగమించాలంటే చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాల్సిన అవసరం ఉంది. ఈ బిల్లు పార్లమెంట్‌లో పెండింగ్‌లో ఉన్న విషయం విదితమే. ఈ బిల్లును చట్టం కింద తీసుకువస్తే ఎక్కువమంది మహిళలు రాజకీయాల్లో అడుగుపెట్టే అవకాశం కలుగుతుంది. తద్వారా మహిళలకు మరింత ప్రోత్సాహం, అవకాశాలు పెరుగుతాయి. కాగా, రాష్ట్రంలో మహిళా సాధికారతకోసం తెలుగుదేశం ప్రభుత్వం ఆనాటినుంచి నేటివరకు తోడ్పాటునందించింది. అప్పటి ముఖ్యమంత్రి దివంగత ఎన్‌టి రామారావు చేసిన చట్టం వల్ల తల్లిదండ్రుల ఆస్తిలో మగపిల్లలతో సమానంగా ఆడపిల్లలకు ఆస్తిని కట్టబెట్టాలని చట్టం చేశారు. దీనివల్ల మహిళలకు భరోసా వచ్చింది. నేడు ఆడపిల్లలు హైస్కూల్ స్థాయిలోనే చదువు మానేయకుండా ఉండేందుకు తెలుగుదేశం ప్రభుత్వం విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేస్తోంది. మహిళా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు కూడా బాలికల విద్యకు అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. ఆడపిల్లలకు ఉచిత విద్య, ఆడపిల్లలు పిజి వరకు చదువుకోడానికి, విదేశీ విద్యను అభ్యసించేందుకు రూ.10 లక్షలు వరకు రుణ సౌకర్యం కల్పిస్తున్నారు. గిరిజనులు, ముస్లిం తరగతికి చెందిన ఆడపిల్లలు వివాహం చేసుకునేందుకు ప్రభుత్వం ప్రోత్సాహాన్ని అందిస్తోంది. మరోపక్క డ్వాక్రా మహిళలకు పెట్టుబడి నిధి కింద రాష్ట్రంలో 90 లక్షలు మంది మహిళలకు ఒకొక్కరికి రూ.10వేలు చొప్పున ప్రభుత్వం అందజేసింది. ఈ విధంగా సమాజంలో మహిళలు సాధికారత సాధించేందుకు అన్ని విధాల ప్రభుత్వం ప్రోత్సాహాన్ని అందిస్తొంది.
- మీసాల గీత ఏపీ శాసనసభ స్ర్తి శిశు సంక్షేమ కమిటీ చైర్‌పర్సన్