ఫోకస్

ప్రచారం జరగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహిళా సాధికారతకోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు, కార్యక్రమాలు చేపట్టింది. ఇవి ఇప్పటికే సత్ఫలితాలు ఇస్తున్నాయి. అయితే ఎలాంటి చదువురాని మహిళలు, గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు కూడా ప్రభుత్వం కల్పించిన అవకాశాలను ఉపయోగించుకునేందుకు విస్తృతంగా ప్రచారం జరగాలి. ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలు చేయాలి. స్వయం సహాయ సంఘాలకు (ఎస్‌హెచ్‌జి) ప్రభుత్వం ఇస్తున్న చేయూత దేశంలో ఏ ఇతర రాష్ట్రాల్లోనూ లభించడం లేదంటే అతిశయోక్తి కాదు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు మహిళల్లో ఆత్మస్థైర్యాన్ని, ఆర్థిక బలాన్ని చేకూర్చడమే కాకుండా, పేదకుటుంబాలకు ఒక వరంలా మారింది. విద్య, ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు, స్థానిక సంస్థల్లో 33 శాతం రిజర్వేషన్లతో సమాజంలో ఊహలకు అతీతంగా మార్పులు వచ్చాయి. స్థానిక సంస్థల పరిపాలనలో భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉంది. ప్రధానంగా దళితులు, గిరిజన తెగలకు చెందిన మహిళలు గ్రామపంచాయితీ సభ్యులుగా, సర్పంచ్‌లుగా, ఎంపిటిసిలు, జడ్‌పిటిసిలుగా, మండలాధ్యక్షులుగా, జిల్లాపరిషత్ చైర్మన్లు, మున్సిపాలిటీ, కార్పోరేషన్ల చైర్‌పర్సన్లుగా ఎన్నికై పాలన కొనసాగిస్తున్నారు. చట్టసభల్లో కూడా మహిళా సభ్యులకు సముచిత ప్రాధాన్యత లభిస్తోంది. మహిళా బిల్లును పార్లమెంట్ ఆమోదిస్తే భవిష్యత్తు మహిళలదే అవుతుంది. ఆకాశమే హద్దుగా మహిళలకు అవకాశాలు ఉండాలని నాలాంటి వాళ్లు పోరాటం చేస్తున్నాం. సామాజిక పరంగా, శారీరకపరంగా మహిళలకు కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ, అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నాం. కొన్ని ప్రాంతాల్లో, కొన్ని కుటుంబాల్లో కుటుంబ సభ్యుల నుండే మహిళలకు సహకారం అందడం లేదు. అందుకే ప్రతికుటుంబంలో కూడా మగ, ఆడ అన్న తేడాలేకుండా అందరికీ సమాన అవకాశాలు ఉండేలా చూడాల్సిన అవసరం ఉంది. ఎంబిఎస్ లాంటి సంస్థలు మహిళల హక్కుల కోసం, ఆర్థికంగా లబ్ది చేకూరేందుకు చక్కని ప్రయత్నాలు చేస్తున్నాయి. సమాజంలో అన్ని సంఘాలు, సంస్థలు కూడా మహిళలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. చిన్న, చిన్న వ్యాపారాలు, కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు మహిళలకు చేయూత ఇవ్వడం వల్ల కుటుంబాల ఆర్థిక పరిస్థితిలో మాకు భాగస్వామ్యం లభించినట్టవుతుంది. ‘కృషి ఉంటే మనుషులు రుషులవుతారు, మహాపురుషులవుతారు’ అన్న సూక్తిని మహిళలు ఆదర్శంగా తీసుకోవాలి. అభివృద్ధిలో ముందుకు సాగేందుకు మహిళలకు మహిళలే చేయూత ఇస్తూ, మార్గదర్శకులుగా నిలవాల్సి ఉంది.
- పి. గిరిజ ఇంటీరియర్ డిజైనర్, మెంబర్ మనబ్రాహ్మణ సమాజం