ఫోకస్

ఏపీ ఎప్పుడూ ముందంజే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహిళా సాధికారతను సాధించడంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచి ఆంధ్రప్రదేశ్ ఎప్పుడూ ముందంజలోనే ఉంది. దివంగత నందమూరి తారక రామారావు హయాంలో దేశంలోనే తొలిసారిగా మహిళలకు 33 శాతం రిజర్వేషన్, మహిళలకు ఆస్తిలో హక్కు, ప్రత్యేక వర్శిటీ ఏర్పాటు చేశారు. చంద్రబాబు హయాంలో స్థానిక సంస్థల్లో మహిళా రిజర్వేషన్లను 50 శాతానికి పెంచారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన డ్వాక్రా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కుతుంది. రికార్డు స్థాయిలో 9 లక్షల గ్రూప్‌లు ఏర్పాటు కావడమే కాకుండా రుణమాఫీ కూడా జరిగింది. ప్రస్తుతం డ్వాక్రా మహిళలు వారి కాళ్లపై వారు ఆధారపడటమే కాకుండా కుటుంబాన్ని కూడా పోషించే స్థాయిలో వ్యాపారాలు చేసుకునేలా పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సాహం కల్పిస్తున్నారు. తాజాగా జరిగిన ఉమెన్ పార్లమెంట్ అనంతరం ప్రకటించిన అమరావతి డిక్లరేషన్ మహిళల్లో ఆత్మస్థైర్యాన్ని నింపింది. జీవనోపాధికై ఉభయ గోదావరి జిల్లాలు, కడప జిల్లాల నుంచి మహిళలు ఎందరో వెలస వెళుతున్నారు. మొత్తంమీద ఆంధ్ర ప్రదేశ్‌లో మహిళలకు ఆర్థిక స్వావలంబన ఏర్పడింది.
- పంచుమర్తి అనూరాధ చైర్‌పర్సన్, మహిళా సహకార ఆర్థిక సంస్థ, ఆంధ్రప్రదేశ్