ఫోకస్

మహిళా భాగస్వామ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సమాజ సమగ్ర పురోగతిని కాంక్షించే వారంతా కోరుకునేది ఒక్కటే, అన్ని రంగాల్లో మహిళలు పూర్తిస్థాయిలో భాగస్వామ్యం కావాలి. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ప్రపంచ ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సదస్సు తుది సందేశం కూడా అదే. సాధికారత సాధించాలంటే మహిళలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా కూడా ఎదగాల్సి ఉంటుంది. మరీ ముఖ్యంగా విద్యాపరంగా ఎదిగినపుడు వారు మిగిలిన అన్ని రంగాల్లో కూడా రాణించగలుగుతారు. మహిళల సమస్యలు, వాటి పరిష్కారాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దశాబ్దాలుగా ఎనలేని కృషి చేయడంతోపాటు వారి రక్షణకు అనేక చట్టాలు తీసుకువచ్చాయి. ఆధునిక సమాజంలో పురుషులతో సమానంగా నిర్ణయాత్మకస్థితిలో మహిళలు ఎదుగుతున్న తరుణంలో పురుషులతో పాటు సమానమైన గౌరవాన్ని, స్థితిని పొందాల్సి ఉంటుంది. అపుడే వారికి సమానస్థితి సాధ్యమవుతుంది. భారతదేశం మొదటి నుండీ స్ర్తిని ఆదిశక్తిగా, అపరశక్తిగా గౌరవిస్తూనే ఉంది. వేదకాలం తర్వాత మహిళల స్థితి, హోదా, గౌరవం తగ్గుతూ వచ్చాయి. అనేక ఆంక్షలు వారిని తక్కువ స్థాయికి నెట్టేశాయి. సతీసహగమనం, బాల్య వివాహాలు వంటి సాంఘిక దురాచారాలు సైతం వారి పట్ల వివక్షకు కారణమయ్యాయి. మహిళలకు రానురాను కనీస మానవ హక్కులను దూరం చేశారు. ప్రాథమిక హక్కులైన విద్య, ఆర్థిక స్వాతంత్య్రం, సమాన హోదా నిరాకరిస్తూ వచ్చారు. మహిళలపై సమాజ వైఖరి కూడా వివక్షతో కూడుకోవడం, గృహ హింస, మానసిక-లైంగిక హింసలు , భౌతిక హింస పెరగడం, నాలుగు గోడలకే చాలామంది మహిళలను పరిమితం చేయడం, నిర్ణయాల్లో వారికి ప్రాధాన్యత లేకపోవడంతో స్ర్తి శక్తి ద్వితీయశ్రేణికి చేరింది. మరోపక్క వారికి సరైన పౌష్టికాహారం అందకపోవడం, ఆరోగ్యంపై అవగాహన లేకపోవడం మరింత వేదనకు కారణమైంది. రాజ్యాంగంలో స్ర్తిల రక్షణకు అనేక చర్యలు తీసుకోవడం జరిగింది. అధికరణం -14 ప్రకారం చట్టం ముందు అందరూ సమానులే, అధికరణం 16-1లో లింగబేధం ఆధారంగా ఎవరినీ వివక్షకు గురిచేయకూడదు, 16-3లో రాజ్యం మహిళలకు ప్రత్యేక సదుపాయాలు కల్పించవచ్చు. 39-ఎలో మహిళలకు పురుషులతో సమానంగా ఉపాధి కల్పించాలి. అధికరణం 42లో పనిచేసే ప్రదేశాల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలి. అధికరణం-46 ప్రకారం సామాజిక న్యాయం, 47 నుండి పోషాకాహార భద్రత, 51-ఇ నుండి వివక్ష నిరోధం, 243డి నుండి పంచాయతీ ఎన్నికల్లో మూడో వంతు సీట్ల కేటాయింపు, 243-డి(4) ద్వారా చైర్మన్ పోస్టుల్లో మూడో వంతు కేటాయింపు, అలాగే మున్సిపాల్టీ సీట్లలో కేటాయింపు, చైర్మన్ ఇతర పదవుల్లో మూడో వంతు సీట్ల కేటాయింపునకు కూడా రాజ్యాంగ రక్షణ ఉంది. వీటితోపాటు జాతీయ మహిళా విధానం, సాంఘిక సాధికారత సహా అనేక పథకాలను సైతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్నాయి. అయినా పరిస్థితులు మెరుగుపడటం లేదు. ఈ క్రమంలోనే కొంతమంది ప్రముఖుల అభిప్రాయాలే ఈ వారం ఫోకస్.