ఫోకస్

పరాయ భాషలో పాలన బాధాకరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ పరిపాలన ఉత్తర్వులను నేటికీ 80శాతం ఆంగ్లంలోనే నిర్వహించడం, తెలుగుభాషతోపాటు దేశంలోని అన్ని ప్రాంతీయ భాషలకు శాపంగా మారింది. జిల్లా, మండల స్థాయిలో సైతం నేటికీ అధికారులు ఆంగ్ల భాషలోనే కంప్యూటర్లను సైతం వాడుతున్నారు. ఫలితంగా తెలుగుపట్ల నిర్లక్ష్యం, ఆంగ్ల ఉత్తర్వులు ప్రజలకు అర్థంకాకుండా చూడటం, తద్వారా అవినీతి విస్తరణకు కారకులవుతున్నారు. పాలనా భాష ఆంగ్లం కావడంతో ప్రజలకు సహజంగానే ఆంగ్లభాష పట్ల మోజు, తెలుగుపట్ల చిన్నభావం ఏర్పడుతోంది. కనుక ప్రభుత్వం ఒకటి నుంచి 12వ తరగతి వరకు తప్పనిసరిగా తెలుగు నేర్చుకోవాలన్న ఉత్తర్వులు మాదిరిగానే ప్రభుత్వ ఉత్తర్వులతోపాటు, ఫైళ్ళన్నీ తెలుగులోనే ఉండాలనే నిబంధన విధించాలి. ప్రపంచీకరణ తెలుగుకు పట్టిన కొత్త తెగులు. దీనివల్ల విదేశీమోజు పల్లెనుండి పట్టణం దాకా పెరిగిపోయింది. ఫలితంగా నూతనతరం ప్రైవేటు విద్య, ఆంగ్ల మాధ్యమంపై మొగ్గు చూపుతున్నారు. మాతృభాష నుంచి పరాయి భాష నేర్చుకోవడం తేలికన్న విషయం మరిచి అభివృద్ధికి ఆంగ్ల మాధ్యమమే శరణ్యం అనే స్థితికి వెళ్ళిపోయారు. రెండవది మెకాలే పునాదులు. భౌతికంగా భారతీయులు ఆలోచనల్లో ఆంగ్లేయులుగా తయారు చేసుకోవాలనుకున్న బ్రిటిషు పరిపాలన ఎత్తుగడలనే ఇప్పటికీ మన ప్రభుత్వాలు తు.చ. తప్పకుండా అమలు చేస్తున్నాయి. వీటిని మానివేస్తేనే ప్రాంతీయ భాషలు అభివృద్ధి చెందే అవకాశం ఉంది. తెలుగు భాష అమలుకు ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి.
- ఎన్ తిర్మల్. ప్రముఖ కవి, రచయిత