ఫోకస్

ప్రాథమిక స్థాయి నుంచే తెలుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భాషా ప్రాతిపదికన ఈ దేశంలో కొత్త రాష్ట్రాలు ఆవిర్భవించాయి. భాష నశిస్తే ఆ జాతి కూడా నశిస్తుంది. అందుకే ప్రస్తుత తెలుగు రాష్ట్రాలు తెలుగును కాపాడుకోవాల్సి ఉంది. బోధన భాషగా తెలుగు ఉన్నప్పుడే పరిపాలన కూడా తెలుగులో సాఫీగా జరుగుతుంది. నా భాషలో చదువుకోవాలి.. నా భాషలో పాలించుకోవాలి.. నా భాషలో అభివృద్ధి సాధించాలనేది అందరికీ ఉంటుంది. అయితే ఈ వౌలిక సిద్ధాంతానికి తెలుగు రాష్ట్రాలు దూరంగా జరిగాయి. పాలకులు ఎవరైనా గత 60 ఏళ్లలో ప్రజలకు సంబంధం లేని పరాయి భాషలోనే పాలన సాగుతున్నది. ఇక న్యాయస్థానాల్లో వాదోపవాదాలు ఆపై తీర్పులు ఇంగ్లీషులోనే ఉంటే అతి సామాన్య కక్షిదారుల పరిస్థితి అగమ్యగోచరమే. అసలు మాతృభాషలో పాలన సాగకపోతే అది ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది? 400 సంవత్సరాల క్రితం పండితులు, కవులకు మినహా భాషతో సంబంధం ఉండేది కాదు. నేడు అన్నిస్థాయిల్లోని వారికీ మాతృభాష అవసరం. మూడేళ్ల వయస్సు నుంచే పరాయి భాషలో పసికందులను చదివిస్తూ హింసిస్తుంటే ఎలా? అంతర్జాతీయ సంస్థలు యునెస్కో, భారత రాజ్యాంగంలో 350 అధికరణ నిర్బంధ విద్యా హక్కు చట్టం మాతృభాషలోనే అధ్యయనం సాగాల్సి ఉంది. ప్రాథమిక స్థాయిలో విధిగా తెలుగు మాద్యమంలోనే బోధన సాగాలి. వీలైతే సెకండరీ తరగతుల్లో కూడా జరగాలి. ఏదో ఒక సబ్జెక్టు కింద మాతృభాషలో బోధన జరిగితే ఎలా? తెలుగు రాష్ట్రాల్లో తెలుగులో చదువుకోవడానికి పాఠశాలలు అందుబాటులో లేకుండా పోతుండటం బాధాకరం. హైదరాబాద్‌లో జరుగబోయే ప్రపంచ తెలుగు మహాసభల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలన తెలుగులోనే సాగిస్తామంటూ ప్రతిజ్ఞ చేయగల్గితే ఆయన చరిత్రలో నిలిచిపోతారు. అలాగే చంద్రబాబు కూడా ప్రతిజ్ఞ చేయాల్సి ఉంది.
- డా.సామల రమేష్‌బాబు అధ్యక్షులు, తెలుగు భాషోద్యమ సమాఖ్య