ఫోకస్

తీర్పులు తెలుగులో రావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యాయస్థానాల్లో ఏ భాష వాడాలన్న అంశంపై స్పష్టమైన నియమావళి ఉంది. ఉన్నత న్యాయస్థానాలైన సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో ఇంగ్లీషులోనే న్యాయమూర్తులు తీర్పు చెప్పాల్సి ఉంటుంది. వాదోపవాదాలు ఇంగ్లీషులో సాగించాల్సి ఉంది. స్టేట్ జ్యుడీషియరీ పరిధిలోని జిల్లా కోర్టులు, అదనపు జిల్లా కోర్టులు, సీనియర్ సివిల్ జడ్జి కోర్టులు, జూనియర్ సివిల్ జడ్జి కోర్టులు తదితర సబార్డినేట్ కోర్టుల్లో ఆ యా రాష్ట్రాల్లోని మాతృభాషను వాడవచ్చు. కేసుల్లో వాదనలు మాతృభాషలో కొనసాగించవచ్చు. అంటే తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో తెలుగులో వాదనలు వినిపించవచ్చు. జడ్జీలు తెలుగులో తీర్పులు వెలువరించవచ్చు. అయితే ఇది జడ్జీ ఇష్టంపై ఆధారపడి ఉంటుంది. ఇంగ్లీషులో తీర్పులు చెప్పేందుకు, తెలుగులో తీర్పుల చెప్పేందుకు అవకాశం ఉంది. తమళినాడు, కర్నాటక, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో మాతృభాషలోనే కిందిస్థాయి కోర్టుల్లో పరిపాలన నిరాటంకంగా సాగుతోంది. అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా తెలుగులో వాదనలు, ప్రతివాదనలను న్యాయవాదులు చేసే అవకాశం ఉంది. జడ్జీలు తెలుగులో తీర్పులు వెలువరించవచ్చు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఈ విధానం అమల్లో ఉంది. అయితే కొన్నిచోట్ల ఇంగ్లీషులో కోర్టు కార్యకలాపాలు నేటికీ నడుస్తున్నాయి. ఈ విధానంలో సమూల మార్పులు రావలసి ఉంది. స్థానిక భాషలో తీర్పులు వెలువరించడంలో ఇబ్బందిపడాల్సిన అవసరం లేదు. ఉన్నతస్థాయి కోర్టులే ఈ అంశంపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేశాయి. ప్రభుత్వ నిర్ణయం కూడా ఇదే విధంగా ఉంది. రాష్ట్రంలో పరిపాలన తెలుగులో పూర్తిగా సాగాల్సిన అవసరం ఉంది. వివిధ విభాగాలు పరిపాలనలో తెలుగు ప్రాధాన్యత ఇస్తే బాగుంటుంది.
-జస్టిస్ రెడ్డప్పరెడ్డి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మాజీ నాయమూర్తి