ఫోకస్

భాషాభివృద్ధికి ప్రత్యేక చొరవ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్రామీణ ప్రాంత ప్రజలు సైతం ఆంగ్ల మాద్యమానికి అలవాటుపడుతున్న వైనాన్ని దూరదృష్టితో పసిగట్టిన రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తెలుగు భాషాభివృద్ధికి ప్రత్యేక చొరవ చూపిస్తున్నారు. హళం పట్టి పొలం దున్ని జీవించిన బమ్మెర పోతన భాగవతాన్ని తెలుగులోకి అనువధించిన గొప్పకవి. ఈ తరానికి వస్తే గుఱ్ఱం జాషువా, శ్రీశ్రీ, దాశరథి, డాక్టర్ సీ.నారాయణరెడ్డి, వేటూరి సుందర రామమూర్తి లాంటి ఎందరెందరో మహాకవులు తెలుగు భాషను వేన్నోళ్ల కీర్తించి తెలుగువాళ్లు గర్వపడేలా ఖండాంతరాలకు చాటిచెప్పారు. సత్యహరిశ్చంద్ర నాటకంలోని పద్యాలు జాషువా కలంనుండి జాలువారినవే. అమ్మ అనే మధురమైన మాటకు తిలోదకాలిస్తూ అలా పిలువ కూడదంటూ మమీ, డాడీ అని పిలవాలని మన పిల్లలను తప్పుదారి పట్టిస్తున్నాం. తెలుగు భాష ఆదరణ సన్నగిల్లి పోకూడదనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల్లో ప్రాథమిక స్థాయి నుంచి ఇంటర్మీడియెట్ వరకు తెలుగు బోధనను తప్పనిసరి చేశారు. తెలుగు భాషపై పట్టున్న ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో తెలంగాణ నడిబొడ్డున ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించుకోవడం ఆనందంగా ఉంది. దేశ విదేశాల నుంచి వచ్చే కవులు, కళాకారులెందరినో ఒకే వేదికపై చూసే భాగ్యం తెలంగాణ ప్రజలకు దక్కుతుంది. దేశవిదేశాలకు తెలుగు భాష గొప్పతనాన్ని చాటిచెప్పేందుకు ఇదో సువర్ణావకాశం. సూర్య, చంద్రులున్నంత కాలం తెలుగు భాష వెలుగొందుతుంది. ‘తేటతేట తెలుగులా..’ అన్నట్లుగా తరతరాలు, యుగయుగాలుగా కొనసాగుతుందనే పూర్తి విశ్వాసం ఉంది.
- చింతా ప్రభాకర్, ఎమ్మెల్యే సంగారెడ్డి