ఫోకస్

ప్రభుత్వాదేశాలు తెలుగులో ఉండాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగరికత ఉన్న ప్రతి జాతి మాతృభాష ద్వారానే ప్రపంచాన్ని చూస్తుంది. మాట్లాడుతుంది. మాతృభాషలో మాట్లాడకుండా, పరాయి భాషలో మాట్లాడే వారు ఎంతపెద్దవారైనా వారి భావ వ్యక్తీకరణలో లోపం కనిపిస్తుంది. మాతృభాష అంటే తల్లి భాష. మనం ఏ సమాజంలో అయితే జన్మించామో, ఆ సమాజంలో మన ఇంట్లోను, ఇరుగు పొరుగు, రాష్ట్రంలోను మాట్లాడే భాషను మాతృభాష అంటాం. మాతృభాష పట్ల చిన్న చూపు తగదు. ఇద్దరు తెలుగువాళ్లు కలిస్తే ఆంగ్లంల్లో మాట్లాడుకుంటారనే జోకు ఉంది. తెలుగు వారికి పుస్తకాలు కొని చదువుకునే అలవాటు ఉందని చిలకమర్తి లక్ష్మీనరసింహం, గురజాడ అప్పారావు, కందుకూరివీరేశలింగం, పుట్టపర్తి నారాయణాచార్యులు లాంటి మహానీయులు చాలాసార్లు చెప్పారు. మాతృభాషలో ఉండే మధురిమలను తెలుగు ప్రజలు ఆస్వాధించాలి. మాతృభాష వల్ల అనేక శాస్త్రాలతోపాటు ఇతర భాషలూ సులువుగా అర్థమవుతాయి. తెలుగు భాషను వ్యవహారిక పద్ధతిలో రాయాల్సి ఉంటుంది. మనం అసెంబ్లీలో కొన్ని బిల్లులను తెలుగులో అనువాదం చేసి ఇస్తుండడం చూశాం. కాని ఇది సామాన్యులకు, తెలుగు భాష కోవిదులకు అర్థం కాదు. గత 70 ఏళ్లుగా ఇదే విధంగా నడుస్తోంది. తెలుగు భాషలో చక్కగా శాసనసభలో ప్రవేశపెట్టిన బిల్లులను రాసి సభ్యులకు, జర్నలిస్టులకు ఇవ్వవచ్చు. దీనివల్ల ప్రజలకు తమ ప్రభుత్వం ఏమి చేస్తుందో తెలుస్తుంది. ప్రభుత్వాదేశాలన్నీ తెలుగులో జారీ చేయాలి. దీనివల్ల సామాన్యులకు తమ ప్రభుత్వం ఏమి చేస్తుందో తెలుస్తుంది. పారదర్శకతకు అవకాశం ఉంటుంది. ఇంగ్లీషులో ఉన్న చట్టాలు, బిల్లులు, జీవోలను ఎంత మంది చదువుతున్నారు? వారికి నిజంగా ప్రభుత్వ కార్యకలాపాలు అర్థమవుతున్నాయి? కర్నాటకలో ప్రతి ప్రభుత్వ కార్యక్రమంలో బ్యానర్లు కన్నడలోనే ఉంటాయి. తమిళనాడు కూడ అంతే. అదే తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ బ్యానర్లు ఇంగ్లీషులో ఉంటాయి. మన బ్యాంకులు కూడా అంతే. అక్కడ తెలుగు దరఖాస్తులు ఉండవు. ఇంతకంటే దౌర్భాగ్యం ఏముంటుంది?
- విశే్వశ్వరరెడ్డి వైకాపా శాసనసభాపక్ష ఉపనేత