ఫోకస్

ప్రజలు, ప్రభుత్వాలూ మేల్కొనాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎంతో మధురమైన తెలుగు మృతభాషగా మారకముందే ప్రజలు, ప్రభుత్వం రెండూ మేల్కొనాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పక్కనే ఉన్న తమిళనాడు రాష్ట్రంలో అక్కడి ప్రభుత్వంతోపాటు ప్రజలు కూడా తమ భాషకు ఇచ్చే ప్రాధాన్యత చూసైనా తెలుగువారిలో మార్పు రావాలి. ప్రభుత్వం తన వంతు ప్రయత్నాలకు, ప్రజల సహకారం ఉంటేనే తెలుగుకు మనుగడ ఉంటుంది. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, దుకాణాల పేర్లన్నీ తెలుగులోనే ఉండేలా ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వాలి. ఇంటర్మీడియట్ వరకూ తెలుగు భాష తప్పనిసరిగా బోధించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకువచ్చిన ఉత్తర్వులు ఎంతో ఆహ్వానించదగినవే కానీ అవి అమలులో కూడా కచ్చితమైన పర్యవేక్షణ ఉండేలా చూస్తేనే భాషను బతికించిన వారవుతారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో తెలుగు భాషను బోధించడంతోపాటు తెలుగు మాధ్యమంలో చదివే విద్యార్థులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రాధాన్యత ఇస్తే తెలుగు భాషకు పరోక్షంగా మేలు చేసినట్లే. విదేశాల్లో ఉన్నవారు తమ పిల్లలకు ‘అమ్మా, నాన్న’ అని పిలుపులు నేర్పిస్తుంటే ఇక్కడ మాత్రం మమీ, డాడీ సంస్కృతి చేరి కమ్మనైన తెలుగును మనమే చంపుకునేలా చేస్తుండడం ఆందోళనకరం. తెలుగు సినిమా పేర్లు కూడా తెలుగులోనే ఉండేలా చూస్తూ, అలా పేర్లు పెట్టుకునే సినిమాలకు ప్రోత్సహకాలు ఇచ్చే అవకాశాలను రెండు తెలుగు రాష్ట్రాలు పరిశీలించాలి. అదే విధంగా తమ సినిమాల్లో తెలుగు పిల్లలకు అవకాశం కల్పిస్తూ భాషరాని వారికి ప్రాధాన్యతనివ్వడాన్ని నిర్మాతలు విడిచిపెట్టాలి. భాషను బతికించడంలో కళాకారులు ఎపుడూ ముందుంటారు. తమ కళా ప్రదర్శనల ద్వారా తెలుగును బతికించే కళాకారులను, కవులను, రచయితలను ప్రభుత్వాలు తరచూ సత్కరిస్తూ భాషా ప్రాముఖ్యతను తెలియజేసే కార్యక్రమాలను జరిగేలా చూడాలి. భాషను బతికించుకోవడం ప్రభుత్వానికి చెందిన వ్యవహారం మాత్రమే అనుకోవడం పొరపాటు. ప్రజలు, ప్రభుత్వం రెండూ కలిసి నడిస్తేనే తెలుగుకు పునర్జీవం కల్పించి, ‘దేశ భాషలందు తెలుగు లెస్స’ అనే మాటను మరోసారి ప్రపంచానికి చాటిచెప్పిన వారమవుతాం.
- అమరావతి కృష్ణారెడ్డి 25 కళాసంఘాల గౌరవాధ్యక్షులు, నెల్లూరు