ఫోకస్

భాషపై స్వాభిమానం పెరగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రెండు తెలుగు రాష్ట్రాలలోనూ తెలుగు భాష అమలు తీరు ఏమాత్రం ఆశాజనకంగా లేదు. వాస్తవ పరిస్థితులను గమనిస్తే తెలుగు భాషపై ప్రజల్లో మమకారం పూర్తిగా తగ్గిపోయింది. మాతృభాష తెలుగుపై స్వాభిమానం పెంచుకునేందుకు కృషి జరగాలి. తెలుగు భాష, జాతి గొప్పది అనే భావం ప్రజల్లో వచ్చినప్పుడే తెలుగుకు పట్ట్భాషేకం కట్టినట్టవుతుంది. తల్లిదండ్రులు తమ పిల్లలను ఇంగ్లీష్ మీడియంలో చదివించడానికి ఇస్తున్న ప్రాధాన్యతలో కొంతైనా తెలుగు భాషపై ఆసక్తి ఎందుకు చూపడంలేదో ప్రతి ఒక్కరూ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ముఖ్యంగా వ్యాపార సంస్థలు బోర్డులపై తెలుగు అమలు చేయాల్సి ఉంది. అలా అమలు కాని పక్షంలో జరిమానా విధించేలా చట్టాన్ని అమలు చేయాలి. ప్రస్తుతం ఉన్న చట్టాలు మూలనపడ్డాయి. వాటిని తిరిగి అమలు చేయకపోతే తెలుగు భాషా వైభవానికే భంగం వాటిల్లే ప్రమాదం ఉంది. ప్రపంచంలోని తెలుగు వారంతా జాగృతం కావాలి. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో వారి వారి మాతృభాషలపై అమితమైన ఆసక్తి చూపుతున్నారు. ఆ విషయంలో ప్రభుత్వాలు అలసత్వం వహిస్తే ప్రజలు తిరగబడే పరిస్థితులు అక్కడున్నాయి. అదే తరహాలో తెలుగు రాష్ట్రాల్లో కూడా తెలుగు అమలు చేసేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ప్రభుత్వాలతో పాటు అన్ని వర్గాల ప్రజలపై ఉంది.
- మండలి బుద్ధప్రసాద్ ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉప సభాపతి