ఫోకస్

భాషా కమిటీలు భర్తీచేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు భాష అమలులో ప్రభుత్వానికి గాని, ప్రజలకు గాని చిత్తశుద్ధి లేదు. ఇంగ్లీష్ విద్యపై మోజుతో తల్లిదండ్రులు తమ పిల్లలను ఆ మీడియం పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. ప్రభుత్వం అన్ని రకాల పాఠశాలల్లోను తెలుగు సబ్జెక్టును తప్పనిసరిగా చేయాల్సివుంది. ఈ దిశగా ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఇంటర్మీడియట్ వరకు తెలుగును తప్పనిసరిగా చేయడం మంచి పరిణామం. మాతృభాష, అధికార భాష సబ్జెక్ట్ లేకుండా డిగ్రీ పట్టాలు పొందే దౌర్భాగ్యం తెలుగు రాష్ట్రాల్లోనే ఉంది. ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రాంతీయ భాషలు అస్తిత్వాన్ని కోల్పోతున్న క్రమంలో తెలుగు భాషను రక్షించుకునేందుకు ప్రజలు, విద్యార్థులు, పాలనా యంత్రాంగం, ప్రభుత్వం, కవులు, రచయితలు, ఉపాధ్యాయులు అంతా కృషి చేయాల్సిన అవసరం ఉంది. వార్షిక పరీక్షల్లో, జాతీయ, ప్రాంతీయ పోటీ పరీక్షల్లో సైతం తెలుగులో ప్రశ్నావళి విధిగా అమలు చేయాలి. తెలుగును నామమాత్రంగా అధికార భాష హోదాకు పరిమితం చేయకుండా పాలనాభాషగా అమలు చేయడంలో ప్రభుత్వం చిత్తశుద్ధి చూపాలి. ఇప్పటికీ అధిక శాతం ప్రభుత్వ ఉత్తర్వులు, చట్టాలు, పథకాల వివరాలన్నీ ఆంగ్లంలోనే వెలువడుతున్నాయి. ప్రభుత్వ శాఖల బోర్డులు కూడా ఆంగ్లంలోనే ఉంటున్నాయి. బస్సు, రైల్వే స్టేషన్లు, బ్యాంకుల్లో కార్యకలాపాలు తెలుగులో సైతం కొనసాగించేలా చర్యలు తీసుకోవాలి. పాలనాభాషగా తెలుగు కచ్చితంగా అమలైనప్పుడే తెలుగు భాష పరిరక్షణ దిశగా ముందుడుగు వేసినట్లవుతుంది. అధికార భాషగా, పాలనా భాషగా తెలుగు అమలుకు ప్రత్యేక వెబ్‌సైట్లు, పదకోశాలు రూపొందించి ప్రాచుర్యంలోకి తేవాలి. తెలుగు భాష అమలు, నిర్వాహణకు శాఖల వారీగా పరిశీలించి అమలు జరిపించేందుకు రాష్ట్ర స్థాయితోపాటు జిల్లా, మండల స్థాయిల్లో తక్షణమే భాష అమలు కమిటీలను భర్తీ చేయాలి. నాలుగేళ్లుగా తెలుగు భాష అమలు కమిటీలు ఖాళీగా ఉన్నాయి. తెలుగు భాష అమలుకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి. తెలుగు బోధన సక్రమంగా సాగేందుకు శిక్షణ తరగతులు నిర్వహించాలి. పద్యాలు, శ్లోకాలు చదవడం విద్యార్థులకు అలవడటం లేదు. వ్యాకరణం, చంధస్సు బోధన కనిపించడం లేదు. తెలుగు విశిష్టతను చాటుతూ పాఠశాలల్లో, ప్రభుత్వ శాఖల్లో, గ్రంథాయాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలి. ప్రపంచ తెలుగు మహాసభల ద్వారా భాషా పరిరక్షణకు ప్రభుత్వం చేస్తున్న కృషి అభినందనీయం.
- పున్న అంజయ్య తెలుగు భాష పరిరక్షణ సమితి అధ్యక్షుడు, నల్లగొండ జిల్లా