ఫోకస్

ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ పార్టీలకు స్థానం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మరో ఏడాది కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో జరుగబోయే సాధారణ ఎన్నికల్లో గుజరాత్ ఫలితాల ప్రభావం అణుమాత్రమైనా కన్పించబోదు. అక్కడ బీజేపీ వరుసగా ఐదుసార్లు అధికారంలో కొనసాగుతూ వచ్చింది. ఇందులో మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసి, గత మూడేళ్లుగా ప్రధానమంత్రి పదవిలోనున్న నరేంద్రమోదీ ఓటమి భయంతో గల్లీగల్లీ తిరిగి ప్రచారం చేయటంలోనే అక్కడ బీజేపీ ఎంత బలహీనంగా ఉందో ఇట్టే అర్థమవుతుంది. ప్రధానంగా ప్రతిపక్షం గట్టిగా లేకపోయినా ఓట్ల కోసం సరిహద్దులోని పాకిస్తాన్ బూచిని చూపి విపక్షాలపై అసత్య ప్రచారం కావిస్తూ పాలకులు నీచ స్థాయికి దిగజారారు. ఇదే సమయంలో అధికార దుర్వినియోగం బాహాటంగా జరిగింది. ఇక ఆంధ్రప్రదేశ్‌లో దానికి భిన్నమైన పరిస్థితి ప్రతిపక్ష నేత జగన్ నేతృత్వంలో వైకాపా నానాటికీ బలోపేతమవుతున్నది. ఇదే సమయంలో అధికారపక్ష తెలుగుదేశం క్రమేణా బలహీనపడుతున్నది. మిత్రపక్ష బీజేపీ నేతలు ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేస్తూ తరచూ ప్రధానమంత్రి మోదీకి ఫిర్యాదు చేస్తూ వస్తున్నారు. ఎక్కడికక్కడ ఆ రెండు పార్టీల నేతల మధ్య కీచులాటలు, బహిరంగ సవాళ్లు ఈ పరిస్థితుల్లో తెలుగుదేశాన్ని ప్రజలు మళ్లీ ఆదరిస్తారనుకోటం భ్రమే కాగలదు. గత ఎన్నికల హామీలనేకం నేటికీ కార్యరూపం దాల్చలేదు. ఈ నేపధ్యంలో పాదయాత్ర సాగిస్తున్న జగన్ వాస్తవిక పరిస్థితులను అవగతం చేసుకుంటూ ఇస్తున్న హామీలను ప్రజలు స్వాగతిస్తున్నది బహిరంగ సత్యం.
- మల్లాది విష్ణువర్ధన్ మాజీ శాసనసభ్యుడు, వైకాపా విజయవాడ అర్బన్ వర్కింగ్ ప్రెసిడెంట్