ఫోకస్

ప్రధాని క్రేజు పార్లమెంటు ఎన్నికలకే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇటీవల జరిగిన గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ అత్తెసరు సీట్లతో గట్టెక్కినప్పటికీ ఆ ఎన్నికల ఫలితాల ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పై ఏమాత్రం ఉండదు. ఎందుకంటే సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడానికి ఇంకా మరో ఏడాదిన్నర సమయం ఉంది. అప్పటి వరకు దీని ప్రభావం ఉండదు. అదీకాకుండా ప్రధాని మోదీ క్రేజ్ అన్నది కేవలం పార్లమెంట్ ఎన్నికల వరకు మాత్రమే ప్రభావం చూపగలదు. అసెంబ్లీ ఎన్నికలపై ఆయన ప్రభావం ఉండదు. రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అనుసరిస్తున్న విధానాల వల్ల ప్రజలు అంత సంతృప్తిగా లేరు. ప్రజల అవసరాలు తీర్చగలిగే ప్రభుత్వానికే ప్రజలు పట్టం కడతారు. ప్రజా వ్యతిరేక విధానాలు చేపడుతున్న ఏ ప్రభుత్వానికి ప్రజలు సానుకూలంగా తీర్పునివ్వరు. ప్రస్తుతం రాష్ట్రంలో టీడీపీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల వల్ల ఏ వర్గంవారూ సంతోషంగా లేదు. అందువల్ల గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలకు ఇక్కడ ఆంధ్రప్రదేశ్‌లో 2019లో జరిగే ఎన్నికలకు ఏమాత్రం సంబంధం ఉండదు.
- బొత్స సత్యనారాయణ మాజీ ఎంపీ, వైకాపా నేత