ఫోకస్

రెండు పార్టీలకీ వాతలే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇటీవల రెండు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో ప్రజలు బిజెపి, కాంగ్రెస్ రెండు పార్టీలకూ వాత పెట్టారు. గుజరాత్ బీజేపీకి కంచుకోట. 22 ఏళ్లుగా అక్కడ అప్రతిహతంగా మంచి మెజార్టీతో గెలుస్తూ వస్తున్న బీజేపీకి మొదటిసారిగా 100 లోపు సీట్లు వచ్చాయి. చావు తప్పికన్ను లొట్టబోయినట్లుగా బీజేపీ అత్తెసరు మెజార్టీతో గెలిచింది. 99 సీట్లు వచ్చాయి. అదే సమయంలో అధికారంలోకి వస్తామన్న విర్రవీగిన కాంగ్రెస్‌కు అధికారంలోకి వచ్చినట్లే వచ్చి చివరి నిమిషంలో సీట్లు జారి 80తో సర్దుకుని ప్రతిపక్షంలో కూర్చుంది. హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ చిత్తుగా ఓడింది. బీజేపీ గెలిచింది. కాని ముఖ్యమంత్రి అభ్యర్థి ధమాల్ ఓటమి చెందారు. గుజరాత్‌ను చూసిన కాంగ్రెస్ 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేస్తామని, దేశమంతా మోడీ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయనే భ్రమలకు లోనైతే మొదటికే మోసం వస్తుంది. కాంగ్రెస్ ఈ రోజు పంజాబ్, కర్నాటకలో మాత్రమే అధికారంలో ఉంది. పైగా రాహుల్ మీద మోజుకంటే బీజేపీ అంటే వ్యతిరేకతతోనే గుజరాత్‌లో ప్రజలు కాంగ్రెస్‌కు మొగ్గు చూపించారు. కాని ప్రజల్లో వ్యతిరేకతను అధికారంలోకి వచ్చేందుకు వీలుగా వ్యవహరించడంలో రాహుల్‌గాంధీ అండ్ కోటరీ విఫలమైంది. మోదీ అనుసరిస్తున్న ఆర్థిక, వ్యవసాయ విధానాలంటే ప్రజల్లో ఏవగింపు మొదలైంది. కఠినమైన నిర్ణయాల వల్ల మధ్యతరగతి ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారు. మేక్ ఇన్ ఇండియా ఏమైందో తెలియదు. మోదీ నియంతృత్వ పోకడలు మానుకోవాలి. అదే సమయంలో వాస్తవంలోకి వచ్చి భారత్‌కు అనుకూలమైన ఆర్థిక, వ్యవసాయ విధానాలను అమలు చేయాలి. లేదంటే వచ్చే ఎన్నికల్లో ప్రజలు బుద్ధిచెబుతారు. బీజేపీకి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ ఒక్కటే. ప్రజలకు ఇష్టం ఉన్నా లేకపోయిన కాంగ్రెస్‌కు ఓటు వేస్తారు. కాని కాంగ్రెస్ పార్టీ సరైన దిశ, దశ లేకుండా నడుస్తోంది. గుజరాత్‌లో 80 సీట్లు వచ్చాయని చంకలు గుద్దుకుంటే ఒరిగేదేమీలేదు. కాంగ్రెస్ పార్టీ తన బలాన్ని కిందిస్థాయి నుంచి బలపరుచుకోవాల్సి ఉంటుంది. హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ ఎన్నికల ఫలితాల ద్వారా ప్రజలు కాంగ్రెస్, బీజేపీకి రెండు పార్టీలకు వాత పెట్టారు. బీజేపీ తన విధానాలపై అంతర్మథనం చేసుకోవాలి. ఒంటెత్తుపోకడలకు దూరంగా ఉండాలి. ప్రజలకు ఏమి కావాలో అది చేయాలి. కాంగ్రెస్ నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష పార్టీ పాత్రను పోషించకుండా, కేవలం ఆర్భాటమైన ప్రకటనలకు పరిమితమైతే ప్రజలు దగ్గరికి రానివ్వరు.
- కె శివకుమార్ ప్రధాన కార్యదర్శి తెలంగాణ వైకాపా శాఖ