ఫోకస్

తెలంగాణలో బీజేపీకి అవకాశం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుజరాత్, హిమచల్‌ప్రదేశ్‌ల ఎన్నికల ఫలితాలు తెలంగాణ రాష్ట్రంపై ప్రభావ శూన్యం. తెలంగాణలో బిజెపి నామమాత్రంగా ఉండగా కాంగ్రెస్ ఉనికికోసం పోరాడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలదే ఆధిపత్యం. ముఖ్యమంత్రి కేసీఆర్ సారధ్యంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతోంది. తెలంగాణలో కాంగ్రెస్‌కు, బీజేపీకి అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు. సంక్షేమంలో, అభివృద్ధిలో నేడు తెలంగాణ దేశంలోనే నెంబర్‌వన్‌గా నిలబడింది. గుజరాత్‌లో సుదీర్ఘకాలం పాలించిన పార్టీపట్ల సహజంగానే కొంత ప్రతికూలత ఉన్న కారణంగానే బీజేపీ సీట్లు తగ్గి, కాంగ్రెస్‌కు పెరిగాయి. అంతేతప్ప ప్రజల్లో ప్రభుత్వాలను మార్చాలనే ఆలోచన ఉన్నట్లుగా ఫలితాల్లో కనిపించలేదు. పెద్దనోట్ల రద్దు, జిఎస్‌టిల పట్ల వ్యాపార వర్గాల్లో, సామాన్య ప్రజల్లో నెలకొన్న కొంత వ్యతిరేకతతో బీజేపీకి తగ్గిన ఓటింగ్ శాతం కాంగ్రెస్ అనుకూలమైంది. తెలంగాణకు వచ్చేసరికి కి, కాంగ్రెస్‌కు ఓటింగ్ శాతం తగ్గితే టీఆర్‌ఎస్‌కు పెరుగనుంది. రాహుల్ సారథ్యంలో కాంగ్రెస్ దేశంలో, తెలంగాణలో పుంజుకుంటుందని చెప్పలేం. రాహుల్ సారథ్యం కాంగ్రెస్‌లో గత పదేళ్లుగా కొనసాగుతోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో కూడా రాహుల్ సారథ్యంలోనే కాంగ్రెస్ సాగిన సంగతి మరచిపోరాదు. ఇప్పటికే తెలంగాణ ప్రజలు ఉమ్మడి రాష్ట్రంలో అరవై ఏళ్ల పాటు కాంగ్రెస్ అవినీతి, అసమర్థ పాలనను చూశారు. ప్రజలు ఒక పార్టీకి ఓటు వేయరు.. ఒకవేళ వేయాలి అనుకుంటే అందుకు బలమైన కారణాలుండాలి. టిఆర్‌ఎస్‌కు ఓటు వేయవద్దు అనుకోవడానికి ఒక్క కారణం లేదు. ఓటు వేయాలనుకోవడానికి వేల కారణాలున్నాయ. ఎన్నికల్లో గెలువడానికి కావాల్సినంత ఓట్ల శాతంకంటే ఎక్కువ ఓటింగ్ శాతం కల్గి ఉన్నాం. టిఆర్‌ఎస్ ప్రభుత్వం పట్ల అసంతృప్తి భావన ప్రతిపక్షాల్లో తప్ప ప్రజల్లోని ఏ వర్గానికీ లేదు. రాష్ట్రం వస్తే తెలంగాణ ప్రజలు ఏమి వస్తదని ఆశించారో అవన్నీ టీఆర్‌ఎస్ ప్రభుత్వం నెరవేరుస్తున్నందున ప్రభుత్వంపై అసంతృప్తి లేదు, ప్రతిపక్షాలకు ఇక అవకాశమే లేదు. అసెంబ్లీ సమావేశాల్లో చర్చలకు సైతం ప్రతిపక్షాలు పారిపోతున్న స్థితి తెలంగాణలో ఉంది. అలాగే గుజరాత్, హిమచల్‌ప్రదేశ్ ఎన్నికల పిదప ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా తెలంగాణలో పర్యటిస్తారని దాంతో బీజేపీ బలోపేతమవుతుందన్న రాష్ట్ర బీజేపీ నాయకుల ఆశలు ఫలించేవి కావు. ఎవరో వచ్చి రాజకీయ మార్పులు తెచ్చే రాజకీయ, సామాజిక వాతావరణం తెలంగాణలో లేదు. గతంలో అమిత్ షా రాష్ట్ర పర్యటనతో ఆ పార్టీకి ఒరిగిందేమీలేదు. తెలంగాణలో ఎంఐఎంకు ఉన్న ప్రత్యేక కారణాలతో ఆ పార్టీ సాధించే ఆరేడు సీట్ల కారణంగా వచ్చే అసెంబ్లీలో టిఆర్‌ఎస్, ఎంఐఎం పార్టీలే మిగులుతాయి.
- జి.జగదీష్‌రెడ్డి తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి