ఫోకస్

కోర్టుల జోక్యంతోనే దర్యాప్తు సంస్థలకు మనుగడ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వానికి అనుగుణంగా వ్యవహరిస్తూ సీబీఐ తన మనుగడను కోల్పోతున్న భావన సమాజంలో ఉంది. 1978, 2007, 2008 సంవత్సరాలలో పార్లమెంటరీ సంఘాలు ఇచ్చిన నివేదికలో సీబీఐకి స్వయం ప్రతిపత్తిని కల్పించాలన్న ఆవశ్యకతను వివరించినప్పటికీ, అధికారంలో ఉన్న అన్ని ప్రభుత్వాలు సీబీఐని జేబు సంస్థగా మార్చి వేసాయన్న భావన ప్రజల్లో ఉంది. పేద ప్రజలకు న్యాయం అందించాలన్న తపనతో కోర్టులు జారీచేస్తున్న ఆదేశాల వలన సీబీఐ లాంటి దర్యాప్తు సంస్థలు కొంతవరకు మనుగడను నిలుపుకొంటున్నాయి. లేకుంటే అధికార పార్టీ కనుసన్నల్లో మెలిగే సంస్థగా మారిపోయేవి. ప్రజలకు తగిన సమయంలో సేవలు అందించని దర్యాప్తు సంస్థలు, పోలీస్, రెవెన్యూ తదితర శాఖల ముఖ్య అధికారులపై చర్యలు తీసుకోవటానికి న్యాయ పరిజ్ఞానమున్న అధికారులతో ఒక చట్టపరమైన సంస్థను ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అప్పుడే పేద ప్రజలకు సత్వర న్యాయం, రక్షణ లభిస్తుందనే నమ్మకం కల్పించిన వారవుతారు. స్వతంత్య్ర దర్యాప్తు సంస్థలపై రాజకీయ ఒత్తిళ్లు కొనసాగితే ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రశ్నార్థకం అయ్యే ప్రమాదం ఉంది. కోర్టుల పర్యవేక్షణలో దర్యాప్తు సంస్థలు నిర్వహించే విచారణల పట్ల అన్ని వర్గాల ప్రజల్లో విశ్వాసం పెరగడంతోపాటు కోర్టుల ద్వారా పూర్తి న్యాయం జరుగుతుందనే ధీమా ప్రజల్లో వ్యక్తమవుతుంది. సీబీఐకి స్వయం ప్రతిపత్తి కల్పించినప్పుడే ఆ సంస్థ ప్రజా విశ్వాసాన్ని చూరగొంటుందనేది సుస్పష్టం.
- ఆర్ రోజారెడ్డి నెల్లూరు బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ