ఫోకస్

ప్రభుత్వాల చేతిలో ఆయుధం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రభుత్వాల చేతిలో సీబీఐ ఒక్కోసారి ఆయుధంగా మారుతోంది.. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇటువంటి సంఘటనలు జరగడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే. పాలకులు సీబీఐ అధికారుల నియామకాలు తమకు అనుకూలమైన వ్యక్తులను నియమించుకోవడం జరుగుతోంది. తద్వారా అధికారంలో ఉన్న ప్రభుత్వం వారికి కావాల్సిన నేరస్థులను కాపాడుకోవడం, రాజకీయ ప్రత్యర్థులపై ప్రతీకారం తీర్చుకోవడం జరుగుతుందన్నది. అంతేకాకుండా అధికార పార్టీకి సంబంధించిన వారు లేదా మిత్ర పక్షాల నాయకుల మీద సీబీఐ నేర విచారణ జరిగేటపుడు అధిక సమయం జాప్యం చేయడం, లోపాలతో కూడిన దర్యాప్తు చేయడం ద్వారా పరోక్షంగా వారి వారిని కాపాడుకునేందుకు పాలకులు చెప్పిన బాటలో సీబీఐ నడుస్తుంది. మరికొన్ని సందర్భాల్లో కేసు విచారణను సంవత్సరాల తరబడి జాప్యం చేయడం ద్వారా పరోక్షంగా పాలకులకు సీబీఐ సహకరిస్తుంది. సీబీఐ వ్యవహార శైలిపై అనేక పర్యాయాలు కోర్టులు మందలించిన సంఘటనలున్నాయ. ఇటీవల 2జీ స్కామ్, మరోవైపు గడ్డి స్కామ్ కేసులను సీబీఐ విచారించింది. దర్యాప్తు లోపంవల్ల 2జీ స్పెక్ట్రమ్ కేసులో ప్రధాన ముద్దాయిపై నేరాన్ని సైతం కొట్టివేస్తూ తీర్పు వెలువడింది. గడ్డి స్కామ్‌లో ఇంకా చాలామంది నిందితులు భాగస్వాములు కూడా రాజకీయ ప్రత్యర్థులపైనే నేర నిరూపణ జరిగి శిక్ష పడింది. దీనిని బట్టి సీబీఐని సందర్భాన్ని బట్టి ఏ విధంగా పాలకులు మేనేజ్ చేసుకుంటున్నారో స్పష్టంగా తెలుస్తోంది. మరోవైపు సిబిఐ కేసులు విచారించే ప్రాసిక్యూటర్లను సైతం ప్రభుత్వమే నియమిస్తుంది కాబట్టి వారిని కూడా ప్రభుత్వం ప్రభావితం చేసి కేసు వాదోపవాదాలు, విచారణా విధానంలో సైతం ముద్దాయిలకు శిక్ష పడకుండా ఉండే విధంగా చేయడం జరుగుతోంది. తద్వారా అటు సీబీఐ, ఇటు ప్రాసిక్యూటర్లను ప్రభుత్వం తన వారిని రక్షించుకోవడం, ప్రత్యర్థులపై ప్రతీకారం తీర్చుకోవడం జరుగుతోంది. ప్రత్యర్థులైన రాజకీయ నాయకుల నివాసాలపై సీబీఐ చేత దాడులు చేయంచి, కేసులు నమోదు చేయించిన సంఘటనలు అనేకం ఉన్నాయి. అదే విధంగా అధికార పార్టీ కార్యకర్తలు సైతం భాగస్వాములైన నేరాలలో సీబీఐని ఉపయోగించి వారిపై కేసులు లేకుండా చేసిన సంఘటనలు అనేకం. సీబీఐ విచారణ సక్రమంగా చేయకపోవడం, అవసరమైన వ్యక్తులను కేసులలో ఇరికించి అనేక సంవత్సరాలపాటు మానసిక క్షోభకు గురిచేసినా, సంబంధిత సీబీఐ విచారణాధికారులపై శాఖాపరమైన చర్యలతోపాటు బాధితుడికి నష్టపరిహారం ఇప్పించి అతనిపై తప్పుడు కేసులు పెట్టినందుకు సంబంధిత అధికారిని ప్రాసిక్యూట్ చేసేలా న్యాయస్థానాలు ఆదేశించే స్థాయికి వెళ్తే తప్ప సీబీఐ వంటి సంస్థలు సక్రమంగా ఎటువంటి రాజకీయ వత్తిళ్లకు లోనుకాకుండా చూసినపుడే స్వతంత్రంగా పనిచేసే అవకాశాలు కనిపిస్తాయి. సీబీఐకి వచ్చిన కేసుల్లో విచారణకు సంబంధించి కావాల్సిన సిబ్బంది కొరత కూడా కేసుల విచారణ జాప్యానికి ఒక కారణంగా చెప్పుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో పాలకులకు అనుకూలంగా మీడియా వ్యవహరించడం లేదనే కక్షతో ఆ మీడియా ఫౌండర్లపై సీబీఐచే దాడులు చేయించి లొంగదీసుకునేందుకు చేసిన ప్రయత్నాలు కూడా ప్రజలు గమనిస్తున్నారు. సీబీఐ వంటి విచారణ సంస్థలపై ఈ దేశ ప్రజలకు నమ్మకం కలగాలంటే అధికారులకు ఎటువంటి రాజకీయ వత్తిళ్ళకు లొంగకుండా స్వయం నిర్ణయాలతో కేసుల విచారణ జరిగే విధంగా నిజమైన స్వయంప్రతిపత్తి ఇవ్వాల్సి వుంది. సీబీఐ కూడా అధికార, ప్రతిపక్షమనే తేడా లేకుండా నేరాలకు పాల్పడిన అందరిపైనా సక్రమంగా విచారణ జరిపి వారిపై పెట్టిన కేసు వీగిపోకుండా సక్రమంగా చార్జిషీట్లు దాఖలు చేసే స్థాయికెదిగితే సీబీఐ మీద ప్రజలకు నమ్మకం కలుగుతుంది. జేడీ లక్ష్మీనారాయణ వంటి నిజాయితీగల అధికారులు కొద్దిమందే వున్నారు. నిజాయితీగల అధికారులకు వారిని అణగదొక్కే చర్యలకు పాల్పడతారేది వేరే చెప్పక్కర్లేదు.
-ముప్పాళ్ళ సుబ్బారావు ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్, ఏపీ సివిల్ లిబర్టీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు