ఫోకస్

స్వయంప్రతిపత్తి కల్పించాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతదేశంలో దర్యాప్తు సంస్థలు రాజకీయ ఒత్తిళ్లు, ప్రలోభాలకు గురవుతున్నాయనేది నిర్వివాదాంశం. దర్యాప్తు సంస్థలను స్వయం ప్రతిపత్తి సంస్థలుగా తీర్చిదిద్ధి నిష్పక్షపాతంగా పనిచేసేలా చేసి ప్రజల్లో వాటిపై విశ్వసనీయత పెంచాల్సివుంది. అమెరికా వంటి దేశాల్లో క్రింది స్థాయి నుండి ఉన్నత స్థాయి వరకు దర్యాప్తు సంస్థలు స్వతంత్రంగా పనిచేస్తున్నాయి. ఇదే తరహాలో మన దేశంలోనూ సీబీఐ, విజిలెన్స్ వంటి సంస్థలకు రాజ్యంగబద్ధ స్వయం ప్రతిపత్తినిచ్చి, నిధులు కల్పించినప్పుడే వాటినుండి పారదర్శకమైన ఫలితాలు అందుకోవచ్చు. ఎంత స్వయం ప్రతిపత్తి కల్పించినా వ్యవస్థలను నడిపించే వ్యక్తుల్లో విలువల పతనం రాజ్యంగ వ్యవస్థల పతనానికి దారితీస్తుంది. రాజ్యంగ నిర్మాత డాక్టర్ బిఆర్.అంబేద్కర్ చెప్పినట్లుగా భారత రాజ్యంగం ఏంతో ఉన్నతమైన నైతిక, న్యాయవిలువలతో నిర్మితమైనప్పటికీ రాజ్యంగ వ్యవస్థలను నడిపించే వ్యక్తుల్లో నైతిక విలువలు లోపిస్తే రాజ్యంగం సైతం విఫలమవుతుందన్న మాటలు నిత్యం స్మరణీయం. దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ సైతం అప్రజాస్వామికంగా మారిపోగా ప్రజలెన్నుకున్న ప్రజాప్రతినిధులే వారికి జవాబుదారీగా ఉండటం లేదు. దేశంలోని రాజ్యంగ వ్యవస్థల్లో నైతిక విలువలు, స్వచ్ఛత, పారదర్శకత, జవాబుదారీతనం లోపించాయన్న అభిప్రాయం ప్రజల్లో ఇప్పటికే బలపడింది. దేశంలో గ్రామస్థాయి వ్యవస్థ నుండి ఐఏఎస్ వ్యవస్థల వరకు అవినీతిమయమై పారదర్శకత, విశ్వసనీయతలను కోల్పోతున్నాయి. చివరకు న్యాయ వ్యవస్థలోనూ క్రమంగా అనైతిక అంశాల ప్రభావం చొరబడుతున్న తీరు ఆందోళనకరం. ఈ నేపథ్యంలో అధికారంలో ఉన్నవారు, అంగబలం, ధనబలం ఉన్నవారు నేరాలకు పాల్పడిన సందర్భాల్లో దర్యాప్తు సంస్థలు నేరాల నిరూపణలో ఒత్తిళ్లు, ప్రలోభాలతో విఫలమవుతున్నాయి. అందుకే దర్యాప్తు సంస్థలు పాలకవర్గాల ప్రభావానికి లోనుకాకుండా నిష్పక్షపాతంగా పనిచేసేందుకు వాటికి స్వయం ప్రతిపత్తి కల్పించి కేవలం న్యాయవ్యవస్థలకే జవాబుదారీగా ఉండేలా చూడాలి. కోర్టు తీర్పులు ధైర్యంగా ఇవ్వలేని పరిస్థితులున్నా, దర్యాప్తు సంస్థలు నిష్పక్షపాతంగా విచారణలు సాగించి నేరాలను రుజువు చేయలేకపోయినా ఈ వ్యవస్థలపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లుతోంది. తన హాయంలో నైతికత, స్వచ్ఛత ఉన్నవారి సహకారంతో 69వేల కేసులను సక్రమంగా పరిష్కరించగలిగాం. 2జి స్పెక్ట్రం, బొగ్గు కుంభకోణం కావచ్చు లేదా వ్యాపం, ఆశారాం బాపూజీ, సచ్చాసౌదా డేరా, ఢిల్లీ నకిలీ బ్రహ్మకుమారి బాబ నేరాల వంటి వాటిలో నిందితులకు శిక్షలు పడాలంటే దర్యాప్తు సంస్థలకు స్వయం ప్రతిపత్తి అనివార్యం.
- వంగాల ఈశ్వరయ్యగౌడ్ హైకోర్టు రిటైర్డ్ చీఫ్ జస్టిస్