ఫోకస్

గౌరవప్రదమైన సంస్థ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీబీఐ మనదేశంలో ఒక గౌరవప్రదమైన సంస్థ. అత్యున్నత ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్. ఈ సంస్థ ఏ కేసు చేపట్టినా దేశం మొత్తం అటువైపే చూస్తుంది. అనేక కేసుల్లో నిందితులకు శిక్షపడేలా చూస్తుంది. ఎలాంటి కేసులైనా విచారణ చేసి, సాక్ష్యాలను సేకరించి కోర్టుకు చార్జిషీట్/నివేదిక సమర్పిస్తుంది. సాధారణంగా ‘చట్టం తన పని తాను చేసుకుపోతుంది’ అంటుంటారు. దీనికి నాలుగు ప్రధాన కారణాలను చెప్పుకోవచ్చు. (1) చట్టం నిర్దిష్టంగా (క్లియర్‌గా) ఉండాలి. (2) ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీ చట్టానికి లోబడి పనిచేయాలి. (3) సాక్షులు నిజాయితీగా ఉండాలి. (4) కోర్టు కూడా నిజాయితీగా ఉండాలి. వీటిలో ఏది సరిగ్గా లేకపోయినా ఇబ్బందే. చట్టం ముందు అందరూ సమానమే. పేదలు, ధనికులు, కులాలు, మతాలు, హోదాలు తదితరాలన్నీ చట్టం ముందు సమానమే. చట్టానికి, రాజ్యాంగానికి లోబడే మనమంతా జీవించాలి, పనిచేయాలి. తప్పుచేసిన వారికి శిక్ష పడాల్సిందే. తప్పు చేసినవారు ఎంతటివారైన చట్టం ముందు మినహాయింపు కాదు.
సిబిఐ చేపడుతున్న కేసుల్లో కొన్ని సెనే్సషనల్ కేసులు ఉంటున్నాయి. ఈ కేసులను విచారించడానికి కొన్ని పారామీటర్లు ఉంటాయి. సాంకేతిక సమస్యలు ఎదురౌతుంటాయి. ఉన్నతస్థాయిలో ఉండేవారు నిందితులుగా ఉండవచ్చు. తప్పుచేసిన వారిపై నమోదు చేసే కేసుల్లో సాక్షుల వాఙ్మలం ముఖ్యం. కేసుల ప్రారంభంలో సాక్షులు నిజాయితీగానే ఉన్నప్పటికీ, విచారణ జరుగుతున్న సమయంలో వారు ప్రలోభాలకు లోనయ్యే అవకాశం ఉంటుంది. అందుకే సాక్షులను ఎట్టిపరిస్థితిలోనూ ఎలాంటి ప్రభావానికి లోనుకాకుండా చూడాల్సిన అవసరం ఉంటుంది. 2జి స్పెక్ట్రం కేసు చూడండి.. అక్రమాలు అని ఆరోపించినవారే చివరకు తమ మనసు మార్చుకున్నారు. దాంతో కేసు దారి మళ్లింది. చట్టం ముందు నిలవలేకపోయింది. ఇలాంటి పరిస్థితి అప్పుడప్పుడూ రావచ్చు. ఒక అంశాన్ని ఈ సందర్భంగా పరిశీలిద్దాం. పెద్ద నీళ్ల ట్యాంకులో నీళ్లు పోస్తూ ఉంటే ఆ నీళ్లు అలాగే నిలిస్తే కొద్దిసేపటికి ట్యాంకు నిండుతుంది. కాని ట్యాంకులో ఒకవైపు లీకేజీ జరిగితే నీళ్లన్నీ వెళ్లిపోయి, ట్యాంకు ఖాళీ అవుతుంది. ట్యాంకు నీళ్లతో నిండే అవకాశమే ఉండదు. అలాగే వివిధ సందర్భాలలో సిబిఐ కాని, మరొక విచారణ సంస్థ కాని నమోదు చేసే కేసులు ధృడంగా ఉంటేనే నిందితులకు శిక్ష పడే అవకాశం ఉంది. విచారణ సందర్భంగా ఏమాత్రం తప్పు జరిగినా, సాక్షులు మనసు మార్చుకున్నా, విచారణాధికారులు సరిగ్గా పనిచేయకపోయినా, కోర్టు సరిగ్గా లేకపోయినా సదరు కేసు నీరుకారిపోతుంది.
- జస్టిస్ ఎల్. నర్సింహారెడ్డి పాట్నా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి