ఫోకస్

యుద్ధానికైనా, చర్చలకైనా సిద్ధంగా ఉండాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దాయాది దేశం పాకిస్తాన్ తీరు మారుతుందని భావిస్తే పప్పులో కాలేసినట్లే. భారత్ నుంచి పాకిస్తాన్ మత ప్రాతిపదికన వీడిపోయి 1947 ఆగస్టు 14వ తేదీన ఆవిర్భవించింది. పాకిస్తాన్ భారత్ వ్యతిరేకత ప్రాతిపదికన మనుగడ సాగిస్తోంది. భారత్‌ను ప్రతిక్షణం ఆడిపోసుకుంటే తప్ప, ద్వేషిస్తే తప్ప పాకిస్తాన్‌లో పాలక వర్గానికి భవిష్యత్తు లేదు. భారత్‌పై కుతంత్రాలు పన్నడంలో పాకిస్తాన్, చైనా ముందుంటాయి. ఇటువంటి దేశంతో యుద్ధానికి, చర్చలకు రెండింటికీ సిద్ధంగా ఉండాలి. చర్చలు దౌత్య నీతిలో భాగం. ఆ చానల్‌ను ఎప్పటికీ వదులుకోరాదు. అదే సమయంలో పాకిస్తాన్ హామీలు, ప్రకటనలను నమ్మేందుకు వీలులేదు. పాకిస్తాన్ మూడుసార్లు భారత్‌తో యుద్ధం చేసి ఓటమి చెంది, ఈ రోజు ఉగ్రవాదాన్ని ప్రేరేపించడం ద్వారా యుద్ధం చేస్తోంది. పాకిస్తాన్‌ను అంతర్జాతీయ సమాజంలో ఏకాకిని చేసేందుకు అన్ని రకాలుగా భారత్ చేస్తున్న కృషిని యావత్తు జాతి అండగా నిలబడుతోంది. రాజకీయంగా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతో సిద్ధాంతపరమైన తేడాలున్నా, పాకిస్తాన్ పీచమణిచే ప్రతి చర్యకు ప్రజలు, రాజకీయ పార్టీల మద్దతు ఉంటుంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌కు విముక్తి కల్పించాల్సిన బాధ్యత కేంద్రం అజెండాలో ఉంది. పాకిస్తాన్ ఇటీవల ఆ దేశం అక్రమంగా బంధించిన ఉరిశిక్ష విధించిన జాదవ్‌ను కలుసుకునేందుకు తల్లి, భార్య వెళితే అవమానించి పంపింది. మన మాజీ ప్రధాని వాజపేయి లాహోర్ పర్యటనకు వెళ్లినప్పుడు ఘనస్వాగతం పలికి ఆ తర్వాత కార్గిల్ యుద్ధం చేసి ఓటమి చెందింది. పాకిస్తాన్ సొంతంగా అస్తిత్వం లేని దేశం. మతం పునాదిగా ఆవిర్భవించిన పాకిస్తాన్, భారత్ ఉమ్మడి సంస్కృతి, చరిత్ర కలిగి ఉన్నాయి. అందుకే రెండు దేశాల ప్రజల మధ్య స్నేహం పటిష్టతకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. భారత్ చొరవ తీసుకుని సంస్కృతి, చరిత్ర పటిష్టతకు చర్యలు తీసుకుంటున్న సమయంలో పాకిస్తాన్ పాలక, సైనిక వర్గం తమ ఉనికికి ప్రమాదం వస్తుందనే భయంతో కయ్యానికి కాలు దువ్వుతుంటాయి. పాకిస్తాన్ ఉగ్ర దేశమని అమెరికాతో ప్రపంచ దేశాలు ఎప్పుడో గుర్తించాయి.
- కె శివకుమార్, వైకాపా ప్రధాన కార్యదర్శి, తెలంగాణ