ఫోకస్

హుందాగా వుంటే విలువుంటుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చట్టసభలకు వెళ్లిన ప్రజా ప్రతినిధులు ఎంతో క్రమశిక్షణతో మెలిగి ప్రజల సమస్యలపై ఓపికగా మాట్లాడాలి. ఇతర సభ్యులు మాట్లాడే విషయాలను శ్రద్ధగా వినాలి. సభ జరుగుతున్నంత సేపు 120 కోట్ల మంది భారతీయులు ఒక కంట తమను కనిపెడుతున్నారని అప్రమత్తంగా ఉండాలి. ఇటీవల కాలంలో మన దేశంలో చట్టసభలు రాజకీయ పార్టీ నేతల వ్యక్తిగత అజెండా అమలుకు, ఘర్షణకు వేదికలుగా తయారయ్యాయి. ఇది చాలా దురదృష్టకరమైన పరిణామమని చెప్పవచ్చును. సాధారణ సమయాల్లో పత్రికలకు, టీవీ చానళ్లకు ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు రాజ్యాంగం, లౌకికవాదం, ప్రజాస్వామ్యాన్ని గుర్తుపెట్టుకుని మాట్లాడాలి. ఇటీవల కాలంలో పార్లమెంటు లేదా శాసనసభల్లో సభ్యులు ఇష్టం వచ్చినట్లు దురుసుగా మాట్లాడుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఈసారి పార్లమెంట్ సమావేశాలు ఎటువంటి గొడవలు లేకుండా బాగానే ప్రారంభమయ్యాయి. గతంలో మాదిరిగా కాకుండా ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, ప్రతిపక్ష పార్టీ నేతలను పిలిచి సమావేశమై పెండింగ్ బిల్లులపై చర్చించారు. రాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవంపై లోక్‌సభ, రాజ్యసభలో అన్ని పార్టీలు చర్చించాయి. ప్రజా సమస్యలపై చర్చకు వేదికగా పార్లమెంటు మారాలి. మతతత్వ శక్తుల అసహన ధోరణులపై చర్చను చేపట్టడం కూడా ఆహ్వానిస్తున్నాం. సిపిఎం పార్టీ సభ్యులు సలీం అసహనంపై చాలా వివరంగా మాట్లాడారు. చాలా రోజుల తర్వాత ప్రధాని మోదీ రాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాజ్యాంగ విలువలపై చక్కగా మాట్లాడారు. ఒకరేమిటి అన్ని పార్టీలనేతలు పోటాపోటీగా మాట్లాడారు. కాని ఇతర అంశాలపై కూడా చర్చించేటప్పుడు సభ్యులు సహనంతో ఉండాలి. ఎంత క్లిష్టమైన సమస్య వచ్చినా సభ్యులు తమ సైద్ధాంతిక విధానాలను పక్కనపెట్టి జాతీయ ప్రయోజనాల కోసం ఏకత్రాటి మీదకు రావాలి. చట్టసభల్లో సభ్యులు హుందాగా ఉంటే, మనం చేసే చట్టాలకు విలువ ఉంటుంది.

- విశే్వశ్వరరెడ్డి, వైకాపా ఉపపక్ష నేత