ఫోకస్

పాక్ మిలటరీతోనే చేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాకిస్తాన్‌లో కొనసాగిన మిలటరీ ప్రభుత్వాల స్వప్రయోజనాల కారణంగానే భారత్‌తో మైత్రీ సంబంధాలు దెబ్బతింటున్నాయి. గత దశాబ్దకాలంగా మిలటరీ ప్రభుత్వాలు మిలిటెంట్ వ్యవస్థను ప్రత్యామ్నాయంగా భారత్‌పై ఉసిగొల్పుతున్నాయి. అంతర్గత అస్థిరత్వాన్ని ప్రేరేపించేందుకు తీవ్రవాద సంస్థలను ప్రోత్సహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జరిగిందే కార్గిల్ యుద్ధం. ప్రధానంగా కాశ్మీర్ సమస్య పరిష్కారమైతే భారత్-పాకిస్తాన్‌ల మధ్య సంయమనం కుదిరినట్లేనని భావించాలి. అంతర్జాతీయంగా అభివృద్ధి చెందిన అమెరికా, పాకిస్తాన్‌కు సహకరించడంతో తరచూ కయ్యానికి కాలు దువ్వుతోంది. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వాలు శాంతిని కోరుకుంటాయి. అయితే పాకిస్తాన్‌లో ఇందుకు భిన్నంగా మిలటరీ వ్యవస్థ రాజ్యమేలుతోంది. ఉనికిని చాటుకునేందుకు భారత్‌తో వివాదాలను రెచ్చగొడుతోంది. పాక్ ఆంతరంగిక పరిస్థితుల్లో మార్పులు వచ్చినప్పుడే ఇరుదేశాల మధ్య శాంతియుత వాతావరణం నెలకొంటుంది. అంతర్జాతీయ స్థాయిలో రెండు దేశాల మధ్య సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరగాలి. అంతకుముందు సీమాంతర తీవ్రవాదాన్ని నియంత్రిస్తామని పాక్ ప్రకటించాల్సి ఉంది. అప్పటివరకు భారత్ నుంచి సర్జికల్ దాడులు, పాక్ నుంచి తీవ్రవాద దాడుల ముప్పును ఎదుర్కోవాల్సిందే. అంతిమంగా భారత్ పాలకవర్గాలు రాజకీయ కారణాలను పక్కనబెట్టి దేశ సరిహద్దు సమస్యగా భావించి పరిష్కరించుకుంటే మంచిది.
- కె.ఎస్. లక్ష్మణరావు, మాజీ ఎమ్మెల్సీ.