ఫోకస్

విశాల భారతానికి అవకాశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత్-పాకిస్తాన్ ప్రజల మధ్య ఎలాంటి శత్రుత్వం లేదు. రాజకీయ అవసరాలకోసమే పాలకులు రెండు దేశాల మధ్య శత్రుత్వాన్ని పెంచి పోషిస్తున్నారు. మతపరమైన రాజకీయాలవల్ల రెండు దేశాల మధ్య ద్వేషం పెరుగుతోందే తప్ప సాంస్కృతిక, సాంప్రదాయాల ప్రకారం ఎలాంటి విభేదాలు లేవు. రెండు దేశాల మధ్య శత్రుత్వం ఏర్పడేందుకు చారిత్రక కారణాలున్నాయి. బ్రిటన్ పాలకుల నుండి భారత్ స్వతంత్ర దేశంగా ఏర్పడ్డ నాటినుండి భారత్-పాక్ మధ్య ద్వేషం, విభేదాలు ప్రారంభమయ్యాయి. భారత్-పాక్‌లలో హిందూ, ముస్లింలు లక్షలాది మంది హత్యకు గురయ్యారు. రెండు మతాల మధ్య చెలరేగిన విద్వేషాలను చల్చార్చేందుకు, స్నేహపూర్వక వాతావరణం కల్పించేందుకు మహాత్మాగాంధీ ప్రయత్నించారు. గాంధీ చేసిన ప్రయత్నం, పాకిస్తాన్‌కు 25వేల కోట్ల రూపాయలు ఇవ్వాలన్న ఒప్పందం అమలు చేయాలని గాంధీ చేసిన ప్రయత్నాలు విఫలం కావడమే కాకుండా ఆయన హత్యకు దారి తీశాయి. 1965లో పాక్-్భరత్ మధ్య యుద్ధం జరిగింది. 1971లో పాకిస్తాన్ విడిపోవడానికి భారత్ కారణమన్న భావన పాకిస్తాన్ ప్రజల్లో నాటుకుపోయింది. కాశ్మీర్ సమస్య పరిష్కారం కాకుండా రగులుతూనే ఉంది. ఇవన్నీ ఇరు దేశాల మధ్య విద్వేషాలకు, శత్రుత్వం పెరిగేందుకు దోహదపడ్డాయి. మరోవైపు అమెరికా తన ఆయుధ సంపత్తిని మార్కెటింగ్ చేసుకునేందుకు పాకిస్తాన్‌ను ఉసికొల్పి, భారీఎత్తున పాక్‌కు ఆయుధాలను సరఫరా చేస్తూ వచ్చింది. భారత ఉపఖండంలో అశాంతికి ఇదీ ఒక కారణంగానే చెప్పుకోవాలి. ఇటీవల నేపాల్‌లో 25 సంవత్సరాల వయస్సున్న యువతతో సమావేశం జరిగింది. భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, భూటాన్ తదితర దక్షిణాసియా దేశాల నుండి యువ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ యువ ప్రతినిధుల మధ్య నెలకొన్న స్నేహం, సౌభ్రాతృత్వం చూస్తే నాకు ముచ్చటేసింది. వారిలో ఎలాంటి శత్రుత్వ భావనలు కనిపించలేదు. అందుకే దక్షిణాసియా దేశాల మధ్య స్నేహపూర్వక వాతావరణం నెలకొనాల్సి ఉంది. అన్ని దేశాల నేతలు కలిసి పనిచేస్తే, ఈ దేశాలన్నీ కలిసి ఒక సమాఖ్యగా ఏర్పడేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ సమాఖ్యకు ‘విశాల భారత్’ అని కాని మరో పేరుకాని పెట్టుకునే అవకాశం ఉంది. దక్షిణాసియా దేశాలన్నీ కలిసిమెలిసి పనిచేస్తే ఊహలకు అతీతంగా అభివృద్ధి కనిపిస్తుంది. సైన్యంపై చేసే ఖర్చు తగ్గిపోయి, అదే డబ్బును వ్యవసాయం, పరిశ్రమలు, స్వయం ఉపాధి పథకాలు, కుటీర పరిశ్రమలు తదితర అభివృద్ధి పనులకోసం ఖర్చు చేయవచ్చు. దక్షిణాసియా దేశాలు ఒక సమాఖ్యగా ఏర్పడితే ప్రపంచంలో బలమైన శక్తిగా అవతరిస్తుంది. తద్వారా అది విశ్వశాంతికి మార్గం వేసినట్టవుతుంది. ఇందుకోసం అన్ని దేశాల నేతలు కలిసి చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. దక్షిణాసియా దేశాల నేతలు శాంతియుత వాతావరణంలో కలిసి చర్చలు జరిపితే శత్రుత్వం తగ్గిపోయి, స్నేహం, సౌభ్రాతృత్వం పెరిగే అవకాశం ఉంది. ఇందుకు వివిధ దేశాల నేతల మధ్య చిత్తశుద్ధి అవసరం.
- ప్రొఫెసర్ హరగోపాల్ హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (రిటైర్డ్)