ఫోకస్

దౌత్యంతో పాక్‌కు చెక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆర్ధిక, శాస్త్ర సాంకేతిక, సంప్రదాయ వనరులతో ప్రపంచంలో అగ్రరాజ్యంగా ఎదిగే సామర్థ్యం ఉన్న భారతదేశాన్ని చూస్తే పొరుగు దేశాలు ఉలిక్కిపడుతున్నాయి. సరిహద్దుల్లో చికాకులు కలిగించడమేగాక, ఉగ్రవాదులను రెచ్చగొట్టి, విచ్ఛిన్నకర శక్తులను దేశంలోకి అక్రమంగా పంపిస్తూ భారత్‌ను ఉక్కిరిబిక్కిరి చేయాలనే దురుద్దేశాన్ని ప్రదర్శిస్తున్న దేశాల్లో పాకిస్తాన్‌దే అగ్రస్థానం. భారత్ సైతం ఎప్పటికపుడు పాక్ కుట్రలను తిప్పికొడుతోంది. ఉగ్రవాదులను భారత్‌లోకి చొరబాటుకు తోడ్పడటం, మంచుపర్వతాల్లో ఆకస్మిక దాడులకు పాల్పడటం, చివరికి హిందూ మహాసముద్ర జలాల్లో చైనా కుట్రలకు తోడ్పాటునివ్వడం మామూలైపోయింది. దీంతో ఇరు దేశాల సంబంధాలపై అనుమానపు మేఘాలు కమ్ముకున్నాయి. పాక్ చర్యలకు అమెరికా తరహాలో సర్జికల్ స్ట్రైక్స్ (మెరుపు దాడులు) చేసి పాక్ తీవ్రవాద స్థావరాలను ధ్వంసం చేసి తన సత్తాను చూపింది. ప్రస్తుతం ఇరుదేశాల మధ్య వాణిజ్య సంబంధాలు దిగజారిపోయాయి. క్రీడా సంబంధాలు నిలిచిపోయాయి. మిలటరీ దుందుడుకువాదం, మతోన్మాదం, రాజకీయ అవకాశవాదం, మత్తుపదార్థాల మాఫియాతో పాకిస్తాన్ అట్టుడికిపోతోంది. ఈ శక్తులు అన్నింటికీ వ్యూహాత్మక ప్రయోజనాల రీత్యా భారత్‌తో శాశ్వత వైరం అవసరం. పాక్ ప్రజల్లో తమ పట్టుపెంచుకునేందుకు అవి భారత్ వ్యతిరేకతను కోరుతున్నాయి. భారత్ వ్యతిరేకతే కేంద్రంగా పాక్ వ్యూహం, మిలటరీ నీతి సాగుతోంది. భారత్ మాత్రం పాక్ కుయుక్తులకు అంతర్జాతీయ వేదికలపై సైతం దీటైన సమాధానమే ఇస్తోంది. సైన్యం తమ పని సమర్థంగా ముగిస్తోంది. జమ్మూకాశ్మీర్‌లోని అనువైన ప్రాంతాల్లో తీవ్రవాదులు చొరబాటు, వారిని మన సైన్యం హతమార్చడం దైనందిన కార్యక్రమంగా మారింది. శాంతి, స్నేహ, సహకారాలకు భారత్ వ్యతిరేకం కాకున్నా రక్షణ విషయంలో మాత్రం రాజీపడే ప్రసక్తే లేదనే సంకేతాన్ని చాలా స్పష్టంగా ఇస్తోంది. దేశ భద్రత పటిష్టంగా ఉండాలంటే ప్రమాదాలను జాగ్రత్తగా అంచనా వేసే విదేశాంగ విధానానే్న భారత్ అనుసరిస్తోంది. ఒక దశలో వాస్తవాధీన రేఖ వద్ద పాక్ సైన్యం ఒడిగట్టిన దారుణానికి బదులుగా సంగీత విద్వాంసులను, కళాకారులను పాకిస్తాన్‌కు భారత్ తిరిగి పంపించింది. దీర్ఘకాలిక దృక్పథంతో దౌత్యనీతిని భారత్ రచిస్తోంది. భావోద్వేగాలతో కూడిన స్పందన కాకుండా, స్థిరమైన విదేశాంగ విధానాన్ని అనుసరించడంతో పాటు దీర్ఘకాలిక దృఢమైన వ్యూహాత్మక ప్రయోజనాలను కలిగించే విధంగా భారత్ ఎత్తుగడులు వేస్తోంది. ఈ వ్యూహం మిగిలిన పొరుగుదేశాల విషయంలోనూ భారత్ అనుసరిస్తోంది. అయితే ఇటీవలి కాలంలో హెచ్చుమీరుతున్న పాక్ ఆగడాలపై నిపుణుల అభిప్రాయాలే ఈ వారం ఫోకస్.