ఫోకస్

అధికార పార్టీపె విసుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మరో ఏడాదిలో ఎన్నికలు జరిగే అవకాశాలు ఉండటంతో ఆంధ్ర, తెలంగాణాలో వివిధ పార్టీలు పటిష్ఠం చేసుకునే పనిలో పడ్డాయి. రానున్న కాలంలో రాజకీయాల్లో పలు కీలక మార్పులు జరగనున్నాయి. ఆంధ్రలో వైకాపాను బలోపేతం చేసేందుకు బూత్ కమిటీ స్థాయిలో కన్వీనర్లకు శిక్షణనిస్తున్నాం. ఎన్నికల నిర్వహణలో బూత్ కమిటీలు కీలకపాత్ర వహిస్తాయ. గత ఎన్నికల్లో టీడీపీకి, వైకాపాకు ఓట్ల వ్యత్యాసం 5 లక్షలు. ఈ దఫా ఎన్నికల్లో ఆ వ్యత్యాసాన్ని తగ్గించడంతోపాటు ఓటింగ్‌కు రాని ఓటర్లపై దృష్టిసారించనున్నాం. ఆ విధంగా పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా శ్రేణులను సమాయత్తం చేస్తున్నాం. ఇక ప్రధాని మోదీ ఈ ఏడాది చివరిలో ఎన్నికలు వస్తాయన్న సంకేతాలనివ్వడంతో ఇప్పటికే తెలంగాణా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కేడర్‌ను అప్రమత్తం చేశారు. ఇప్పటికే ప్రజలు ఎప్పుడు ఎన్నికలు వస్తాయా అని ఎదురు చూస్తున్నారు. ఎన్నికలు ఎపుడు వస్తే అపుడు ప్రజలకు మంచి జరిగే కార్యక్రమాలు ఉంటాయి. ఇప్పటికే రాష్ట్రంలో అధికార పార్టీ పట్ల ప్రజలు విసుగుచెంది ఉన్నారు. గత ఎన్నికల్లో ఆవేశంతో వైకాపా పనిచేయడం వల్ల ఓటమిపాలయ్యాము. ఈ దఫా ఆచితూచి ఆలోచనలతో అడుగులు వేయడం ద్వారా ప్రజలను ఆకట్టుకుంటాము. అధికార పార్టీ వైఫల్యాలే మాకు శ్రీరామరక్ష. ఇప్పటికే జన్మభూమి కమిటీలపై ప్రజల్లో అసంతృప్తి నెలకొంది. ఇది మా పార్టీకి కొంతమేరకు దోహదపడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఏది ఏమైనప్పటికీ రానున్న ఏడాది అన్ని విధాల వైకాపా కేడర్ పటిష్టానికి దోహదపడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
- బొత్స సత్యనారాయణ వైఎస్సార్ కాంగ్రెస్ సీనియర్ నేత