ఫోకస్

తృతీయ ఫ్రంట్‌కు ఆస్కారం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దక్షిణాది రాష్ట్రాల్లో తమిళనాడు, కేరళ, కర్నాటక, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో తృతీయ ఫ్రంట్‌కు ఆస్కారం లేదు. ఇక్కడ నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా రెండు పార్టీల మధ్యనే పోటీ ఉంటుంది. తమిళనాడులో తృతీయ ఫ్రంట్ ప్రయోగాలు ఘోరంగా విఫలమయ్యాయి. కర్నాటక కూడ అంతే. కేరళలో మొదటి నుంచీ వామపక్ష కూటమి, కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రజాస్వామ్య కూటమి మధ్యనే పోటీ కేంద్రీకృతమై ఉంటుంది. ఆంధ్ర రాజకీయాల్లో తృతీయ ఫ్రంట్‌కు ఆస్కారం లేదు. వైకాపా, తెలుగుదేశం పార్టీల మధ్య ప్రధాన పోటీ ఉంటుంది. ఇక్కడ నెలకొన్న సామాజిక పరిస్థితులు, రాజకీయ చైతన్యాన్ని విశే్లషిస్తే వచ్చే ఎన్నికల్లో కూడా రెండు పార్టీల వ్యవస్థనే కొనసాగుతుంది. ఆంధ్రాలో రాజకీయ శూన్యత ఉండదు. 2014 ఎన్నికల్లో కూడా వైకాపా దాదాపు అధికారానికి చేరువగా వచ్చి మొత్తం ఐదు లక్షల ఓట్లు మాత్రమే వెనకబడింది. వచ్చే ఎన్నికలు 2019లో జరుగుతాయి. వైకాపా విజయ భేరీ మోగించడం ఖాయం. ఇక్కడ టీడీపీ వైఫల్యాలను ఎండగట్టి ప్రజలను చైతన్యపరిచి జనంలోకి జగన్ పాదయాత్ర ద్వారా వెళ్లారు. జనంనుంచి అనూహ్యస్పందన వస్తోంది. టీడీపీ ప్రజలను మభ్యపెట్టి, తప్పుడు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. ఈ విషయాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారు. చివరకు కేంద్రంలో ఎన్టీయే కూటమిలో భాగస్వామిగా ఉన్నా ప్రత్యేక హోదా, రైల్వే జోన్, రాజధాని నిర్మాణానికి నిధులు తీసుకురాలేకపోయింది. ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. విభజన చేసి ఆంధ్రా ప్రజల నోట్ల మట్టికొట్టింది. అందుకే కాంగ్రెస్ పార్టీ ఆంధ్రాలో భూస్థాపితమైంది. వామపక్ష పార్టీలు కాలక్రమంలో ప్రజలకు దూరమైన సంగతి తెలిసిందే. ఇక్కడ వైకాపా, టీడీపీ మధ్యనే ప్రధాన పోటీ ఉంటుంది. బిజెపి గురించి ఎక్కువగా ప్రస్తావించాల్సిన పనిలేదు. దక్షిణాది రాష్ట్రాల్లో బిజెపి బలం నామమాత్రమే. ఇక్కడ ప్రభుత్వ వ్యతిరేక ఓటు వైకాపాకే పడుతుంది. అలాగే టీడీపీ రాజకీయాలతో విసుగు చెందిన జన బాహుళ్యం వైకాపాకే మొగ్గుచూపుతున్నారు. తెలంగాణలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల వల్ల ఇక్కడ కూడా అనేక పార్టీలు తెరపైకి వచ్చినా ఓట్ల రాజకీయాలు వచ్చేసరికి వాటి పాత్ర అంతంత మాత్రమేనని విశ్వసిస్తున్నాను. తెలంగాణలో టీఆర్‌ఎస్‌ను వ్యతిరేకించే పార్టీలు (బిజెపి మినహా) ఒక వేదికపైకి వస్తాయా రావా అనేది కాలం నిర్ణయిస్తుంది.
- విశే్వశ్వరరెడ్డి వైకాపా ఉపపక్ష నేత ఆంధ్రప్రదేశ్‌అసెంబ్లీ