ఫోకస్

బీజేపీపైనే విశ్వాసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశంలో ప్రజలు అంతా బీజేపీనే విశ్వసిస్తున్నారు. స్వాతంత్య్రానంతరం దేశంలో ఎలాంటి అవినీతి మరక అంటని రీతిలో బీజేపీ పాలన అందించింది. దేశంలో చిట్టచివరి పేదవాడికి సైతం కేంద్ర ప్రభుత్వ పథకాలు అందే విధంగా చర్యలు తీసుకున్న కేంద్ర ప్రభుత్వ విధానాలను దేశ ప్రజలు కొనియాడుతున్నారు. మరోపక్క తెలంగాణ, ఆంధ్రాలో సైతం బీజేపీ ప్రభుత్వానికి ప్రజలు పట్టం కట్టనున్నారు. ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీలను నెరవేర్చడమేగాక, ప్రణాళికలో లేని అంశాలను సైతం కేంద్ర ప్రభుత్వం అమలు చేసి సత్తాను నిరూపించుకుంది. అంతర్జాతీయ వేదికలపై ఉగ్రదేశాలను ఏకాకిని చేయడం మొదలు, యోగాకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడం, ఐక్య రాజ్యసమితి జనరల్ కౌన్సిల్‌లో సభ్యత్వంకోసం ఆసియా దేశాలను ఏకీకరణ చేయడం, పొరుగు దేశాలతో సఖ్యతగా ఉంటూనే వ్యూహాత్మక విదేశాంగ విధానాన్ని అనుసరించడం, నేపాల్, భూటాన్, ఆఫ్గనిస్తాన్ వంటి దేశాలతో నేర్పరితనంతో వ్యవహరించడమేగా, చైనాను ఒక పక్క కట్టడి చేస్తూ అమెరికా, రష్యాలతో సంబంధాలను పెంచుకోగలిగారు. ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనలపై చర్చలు జరిపి దేశంలో ఆహార భద్రతకు వీలు కల్పించారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్‌టీ అమలు, ఆధార్ విశిష్ట సంఖ్య జారీ, బ్యాంక్ అకౌంట్లను ఆధార్ సంఖ్యతో అనుసంథానం చేయడం, డిజిటల్ ఆర్థిక వ్యవస్థను దేశంలో అమలులోకి తీసుకురావడం, స్వచ్ఛ భారత్, డిజిటల్ ఇండియా, నేరుగా బ్యాంకు అకౌంట్లకే కేంద్ర సంక్షేమ పథకాల ప్రయోజనాల చెల్లింపు, స్వచ్ఛందంగా ఆదాయ ప్రకటన, ప్రధాన మంత్రి ఉజ్వల యోజన, ప్రధాన మంత్రి సురక్ష భీమా యోజన, అటల్ పెన్షన్ యోజన, జీవన జ్యోతి బీమా యోచన, ప్రధాన మంత్రి జన్‌ధన్ యోజన, పోస్ట్ఫాసు టైమ్ డిపాజిట్లు, కిసాన్ వికాస్ పత్ర, సుకన్య సమృద్ధి యోజన, ఆరోగ్య బీమా, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామ జ్యోతి యోజన వంటి పథకాల అమలు మాత్రమే కాదు, అనేక కొత్త చట్టాలను, సంస్కరణలను కూడా అమలులోకి తెచ్చింది. యవ్వనప్రాయం 18 ఏళ్ల నుండి ఉన్నదానిని 16 ఏళ్లకు కుదించింది. 9 మంత్రుల స్థాయి కమిటీలు త్వరిత గతిన నిర్ణయాలను తీసుకునేందుకు అవకాశం కల్పించడమేగాక, పాలన వ్యవహారాలపై త్వరితగతిన నిర్ణయాలను తీసుకోవడంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం రికార్డు సృష్టించింది. భారతదేశంలో లేమనే భావన నుండి ఈశాన్య రాష్ట్రాల ప్రజల అపోహలను తొలగించి, పెద్ద ఎత్తున ఆర్ధిక సాయం అందించి, ఆ రాష్ట్రాల్లో నిరుద్యోగాన్ని పారద్రోలి, భారతీయులమనే నమ్మకాన్ని కలిగించడంలో మోదీ ప్రభుత్వం విజయం సాధించింది. అనేక సంస్కరణలు తీసుకురావడం ద్వారా ప్రాంతీయ ప్రభుత్వాలు సైతం వెరవకుండా కేంద్ర ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలిచేలా ప్రధాని చర్యలు చేపట్టారు. పథకాల అమలుకే పరిమితం కాకుండా, ప్రభుత్వాన్ని వేగంగా నడిపించడంలో పరిపాలనాపరమైన చర్యలను సైతం తీసుకుంది. దేశంలో సాంప్రదాయాన్ని కాపాడుతునే ఆధునికత్వాన్ని సంతరించుకునే దిశగా అనేక నగరాల్లో మెట్రో ప్రాజెక్టులను అనుమతించింది. హైదరాబాద్ వంటి సంప్రదాయ నగరాల్లో మెట్రో ప్రాజెక్టుతో కొత్త రూపాన్ని తీసుకురావడంలో కేంద్రం చేసిన కృషి ఎనలేనిది. కేంద్ర ప్రభుత్వ పనితీరును ప్రజలు అర్థం చేసుకుని తమ వంతు సహకారాన్ని అందిస్తున్నారు. ఆ సహకారాన్ని ఓట్ల రూపంలో కూడా పొందేందుకు బీజేపీ అన్ని రకాల ప్రయత్నాలూ చేస్తోంది.
- ఎన్ ఇంద్రసేనారెడ్డి బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు