ఫోకస్

రాజకీయం ఎటువైపు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సార్వత్రిక ఎన్నికల సందడి అప్పుడే దక్షిణాది రాష్ట్రాల్లో మొదలైంది. వచ్చే ఏడాది జూన్‌లోగా సార్వత్రిక ఎన్నికలు జరగాల్సి ఉంది. ఎప్పుడు జరుగుతాయో తెలియకున్నా అన్ని రాజకీయ పార్టీలూ ఎన్నికలకు సన్నద్ధమవుతున్నాయి. అందరి దృష్టీ దక్షిణాది రాష్ట్రాలపై పడింది. మరీ ముఖ్యంగా ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి తన బలాన్ని దక్షిణాది రాష్ట్రాల్లో పెంచుకునేందుకు సర్వశక్తులూ ఒడ్డుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్నాటక, కేరళ, ఒరిస్సా రాష్ట్రాలపై దృష్టిసారించింది. బెంగాల్‌లో సైతం తమ శక్తి పెంచుకునే ప్రయత్నంలో పడింది. తమిళనాడు రాజకీయాల ప్రభావం దక్షిణాదిలోని పొరుగు రాష్ట్రాలపై పడుతుందనేది అందరి భావన. తమిళనాడులో జయలలిత మరణం, తర్వాత జరిగిన పరిణామాలు తాజాగా రజనీకాంత్ రాజకీయ అరంగేట్రం పెను సంచలనమే రేకెత్తిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో పవన్ కల్యాణ్ జనసేన పార్టీ ఏ దిశగా పయనిస్తుందో, ఎంతవరకు ప్రజాభిమానాన్ని పొందుతుందో ఎదురుచూడాలి. తెలంగాణలో రానున్న కాలంలో వివిధ పార్టీల మధ్య పొత్తులు ఎలా ఉంటాయోననే చర్చ మొదలైంది. బిజెపి, తెలుగుదేశం పార్టీలు ఇప్పటికే ఎవరి దారి వారిదే అన్నట్టు వ్యవహరిస్తున్నా ఎన్నికల ప్రకటన రాగానే ఏం జరుగుతుందో తెలియని ఉత్కంఠ నెలకొంది. గతంలో ఈ రెండు పార్టీలకూ మద్దతు ప్రకటించిన పవన్‌కళ్యాణ్ ఈసారి ఏ ఎత్తుగడ అనుసరిస్తారనేది కూడా వేచిచూడాలి. జనసేన-టిఆర్‌ఎస్ దగ్గరవుతాయనే ప్రచారం కూడా ఈ మధ్య సీఎం కెసిఆర్‌తో పవన్‌కళ్యాణ్ భేటీ అనంతరం గుప్పుమంటోంది. గతంలో మాదిరి కాంగ్రెస్ పార్టీ ఎంఐఎంలు చేరువవుతాయా లేదా అనేది కూడా చూడాలి, ఇప్పటికే టీఆర్‌ఎస్ పార్టీ సంతుష్టీకరణ విధానాన్ని పాటిస్తుండడంతో మున్ముందు ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి. ఆంధ్రప్రదేశ్‌లోనూ తెలుగుదేశం-బిజెపిల అనుబంధం ఏ పార్టీకి కలిసి వస్తుందో చూడాల్సిందే, ఎవరికి వారు తమ బలాన్ని పెంచుకోవాలనే తాపత్రయంలో ఉన్నారు. ఇక వైఎస్‌ఆర్‌సీపీ ఒంటరి పోరు కొనసాగిస్తుందా లేక వామపక్ష పార్టీల మద్దతును కూడగట్టుకుంటుందా అనేది తేలడం లేదు. ఇంకోపక్క కాంగ్రెస్ పార్టీ వామపక్షాల బంధం కొనసాగుతుందో లేదో కూడా చూడాలి. ఏ పార్టీ ఏ దిశగా, ఎటు పయనిస్తుందనేది ఎన్నికల ప్రకటన వచ్చేనాటికి ప్రజల గాలి ఎటు వీస్తుందో ఆ దిశగానే సాగుతుందనేది నిర్వివాదాంశం. అయితే ఆంధ్రాలో అధికారంలో ఉన్న తెలుగుదేశం, తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్ మాత్రం వీలున్నంత వరకూ ఫిరాయింపులను ప్రోత్సహించడం, అవతలి పార్టీ నడ్డివిరిచేయడం అనే లక్ష్యంతో పనిచేస్తున్నాయి. ఫిరాయించిన ప్రజాప్రతినిధుల సభ్యత్వాల రద్దు పిటిషన్లు ఆయా స్పీకర్ల వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. వాటిపై సంబంధిత రాష్ట్రాల స్పీకర్లు ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారో తెలియదు. ఇలాంటి సందర్భాల్లో మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని ఉప రాష్టప్రతి ఎం వెంకయ్యనాయుడు తన మాటగా చెప్పినా అది ఎప్పుడు ఎవరికి చెవికెక్కుతుందో తెలీదు. ఈ పరిస్థితుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చే రాజకీయ పరిణామాలపైనే కొంతమంది ప్రముఖుల అభిప్రాయాలే ఈ వారం ఫోకస్.