ఫోకస్

అభివృద్ధి.. బాహుబలి వంటిదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధి జరిగిపోతోందని, తలసరి ఆదాయం పెరిగిపోయిందని చెప్పుకుంటున్న గొప్పలన్నీ యానిమేషన్ టైప్ అభివృద్ధి తప్ప మరొకటి కాదు. రానున్న ఎన్నికల స్టంట్ ఇది. తలసరి ఆదాయం ఎలా పెరిగింది. దేశ వ్యాప్తంగా పెరగని జిడిపి అభివృద్ధి రేటు రెండు రాష్ట్రాల్లో ఎలా పెరుగుతుంది. ఇది ఎలా సాధ్యపడుతుంది. బాహుబలి సినిమాలో యానిమేషన్ చేసి చూపించినట్లే తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న పారిశ్రామికాభివృద్ధి, తలసరి ఆదాయం పెరుగుదల కూడా అటువంటిదే. ఇద్దరు ముఖ్యమంత్రులు పారిశ్రామికాభివృద్ధి జరిగిపోతోందని చెప్పుకోవడం కాదు, ఎలా సాధించారు, ఏ రూపంలో సాధించారో వెల్లడించాలి. పారిశ్రామికాభివృద్ధిపైనా, జిడిపిపైనా శే్వతపత్రం ప్రచురించాలి. ఏదో అభివృద్ధి జరిగిపోయిందని చెబుతున్నారు, ఈ అభివృద్ధి సామాన్యులకు దక్కుతుందా, ఆ ప్రయోజనాలు వారికి కల్పిస్తారా..? అభివృద్ధి, జిడిపి అంటూ రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బెలూన్ టైప్ ప్రచారం చేస్తున్నారు. గాలి ఊది ఊదితే బెలూన్ పగిలిపోయినట్టే ఎన్నికల నాటికి ఈ ప్రచారం సంగతి తేలిపోతుంది. పేదరికం దేశ వ్యాప్తంగా పెరుగుతుంటే తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధి, జిడిపి పెరుగుదల ఎలా సాధ్యమవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ, ప్రభుత్వ రంగంలోని ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ముందుకు రావడం లేదు. ఒక్కసారిగా వృద్ధి రేటు దేశం మొత్తం కాకుండా ఒక్క తెలుగు రాష్ట్రాల్లో పెరగడం ఎలా సాధ్యపడుతుంది. దేశ వ్యాప్తంగా ఉన్న పరిస్థితికి అనుగుణంగా ఉంటుందే తప్ప కొత్తగా ఏదీ రాదు. ఎన్నికల కోసం బ్లూ మ్యాప్, హైటెక్ యానిమేషన్ పనులు తప్ప మరొకటి కాదని నా అభిప్రాయం.
- కె.నారాయణ, సీపీఐ జాతీయ కార్యదర్శి