ఫోకస్

‘హోదా’ లేదు.. పరిశ్రమలు లేవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనతో ఆంధ్ర రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది. ఈ భర్తీనని పూడ్చేందుకు విభజన సమయంలో యుపిఏ ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్ ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంటులో హామీ ఇచ్చారు. ఈ హామీని యుపిఏ, ఎన్టీఏ ప్రభుత్వాలు తుంగలో తొక్కాయి. ఎన్నికల సమయంలో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి ప్రస్తుత ప్రధాని నరేంద్రమోదీ ఎన్నికల్లో ఆంధ్రాకు ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారు. నాలుగేళ్లు అయింది. ఈ హామీని అధికారంలో ఉండే టిడిపి, బిజెపిలు మర్చిపోయాయి. ప్రత్యేక హోదా లేకుండా ఆంధ్రాకు పరిశ్రమలు రావు. నాలుగేళ్లలో చెప్పుకోదగిన పరిశ్రమలు ఏమి వచ్చాయి. ఎన్నో హామీలను ఇచ్చారు. అన్ని గాలిలో కలిశాయి. చంద్రబాబు 17సార్లకు పైగా విదేశీ పర్యటనలు చేశారు. కాని అవగాహన ఒప్పందాలతో కాలక్షేపం చేశారు. 42 సార్లు చంద్రబాబు ఢిల్లీ పర్యటనలు చేశారు. ఏమి సాధించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే జాతీయ, అంతర్జాతీయ పరిశ్రమలు తరలివస్తాయి. ఆదాయం పన్ను, కస్టమ్స్ పన్ను రాయితీలు వస్తాయి. కేంద్రం నిధులతో వౌలిక సదుపాయాలను వెంటనే ఏర్పాటు చేయవచ్చును. ఈ ప్రత్యేక హోదాను కేంద్రమే పార్లమెంటులో హామీ ఇచ్చింది. తాము ఇచ్చిన హామీని తామే మర్చిపోతే, ప్రజలు ఎవరిని నమ్మాలి. 25వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని, పది లక్షల ఉద్యోగాలు వస్తాయన్నారు. ఒక్క శాతం నిధులు కూడా తీసుకురాలేకపోయారు. మొదటి సమ్మిట్‌లోరూ.478 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకువస్తున్నామన్నారు. 10.27 లక్షల ఉద్యోగాలు వస్తాయన్నారు. 2017లో రెండో సమ్మిట్‌లో 10.54 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయన్నారు. ఒక్క వెయ్యి మందిగైనా ఉద్యోగాలు వచ్చాయా ? విశాఖలో జరిగిన మహిళా పారిశ్రామికవేత్తల సమావేశంలో 18 శాఖల పరిధిలో 1900 ఎంఓయూల కుదుర్చుకున్నామని, వీటికి సంబంధించి 13.45 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని, 30 లక్షల ఉద్యోగాలు రాబోతున్నాయన్నారు. ఆంధ్రరాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తే తప్ప పరిశ్రమలురావు. రాష్ట్ర విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఆంధ్ర రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలపైన ఉంది.
- విశే్వశ్వరరెడ్డి వైకాపా శాసనసభాపక్ష ఉపనేత, ఆంధ్రప్రదేశ్