ఫోకస్

తెలంగాణ ఆదర్శనీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు రాష్ట్రాలు పారిశ్రామికాభివృద్ధిలో, పెట్టుబడుల ఆకర్షణలో పోటీపడుతుండగా ఈ పోటీలో తెలంగాణ రాష్ట్రం సీఎం కెసిఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన పారిశ్రామిక విధానాలతో పారిశ్రామిక ప్రగతిలో దూసుకుపోతుంది. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న టిఎస్ ఐపాస్ విధానం ద్వారా సింగిల్ విండో పద్ధతిలో 15రోజుల్లోనే అన్ని అనుమతులిస్తుండటంతో కొత్త రాష్ట్రం తెలంగాణకు పరిశ్రమలు బారులు కడుతున్నాయి. రాష్ట్ర విభజన సందర్భంగా పారిశ్రామిక ప్రగతిపై రేగిన భయాందోళనలను, చీకట్లను తరిమివేసి మూడున్నర ఏళ్ల కొత్త తెలంగాణ రాష్ట్రం నేడు పారిశ్రామిక విధానాల్లో దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలబడింది. ఇతర దేశాల కంపనీలు టిఎస్ ఐపాస్ విధానాన్ని మెచ్చి తెలంగాణలో పెట్టుబడులకు, పరిశ్రమల స్థాపనకు ముందుకొస్తున్నాయి. తెలంగాణ రాజధాని హైద్రాబాద్ నేడు అనేక అంతర్జాతీయ పారిశ్రామిక సదస్సులకు వేదికవుతు విశ్వనగరంగా ఎదుగుతుంది. పరిశ్రమల స్థాపనకు ఒకేసారి అన్ని అనుమతిలివ్వడంతో పాటు వారికి కావాల్సిన విద్యుత్, వౌలిక వసతుల కల్పన కొరత లేకుండా ప్రభుత్వం వాటన్నింటిని సకాలంలో సమకూరుస్తుంది. 24గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నాం. దీంతో టిఎస్ ఐపాస్ ద్వారా ఇప్పటికే 6,039పరిశ్రమలు అనుమతులు పొందగా ఇందులో 3,537పరిశ్రమలు వాణిజ్య ఉత్పత్తులను ప్రారంభించాయి. వాటి ద్వారా 1లక్ష 57వేల మందికి ఉపాధి అవకాశాలు ఏర్పడ్డాయి. నిజాం కాలం నుండి కూడా తెలంగాణ రాష్ట్రం వెల్త్ మేకింగ్‌గా కొనసాగుతుంది. స్వరాష్ట్రంలో స్వయం పాలనలో తెలంగాణ మేక్ ఇన్ తెలంగాణగా, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో మరింత వేగంగా ముందుకెలుతు ఆర్ధికాభివృద్ధి వృద్ధిరేటులో దేశంలో అగ్రగామిగా నిలుస్తుంది. ఇప్పటికే తెలంగాణలో పరిశ్రమల స్థాపనకు 1లక్ష 50వేల ఎకరాల భూ బ్యాంకు ఏర్పాటు చేశాం. మొబైల్, ఎలక్ట్రానిక్స్, మోటార్ వెహికల్, ఐటి, ఫార్మా, జౌళి ఉత్పత్తుల యూనిట్ల స్థాపనకు చైనా, జపాన్, కొరియా, స్విస్ సహా ఇతర దేశాల నుండి పెద్ద ఎత్తున పేరున్న కంపనీలు తెలంగాణలో తమ యూనిట్ల స్థాపనకు చర్యలు ఆరంభించాయి. విదేశీ సంస్థలు కోరితే భారీ రాయితీలతో పాటు ప్రత్యేక పార్కులు, పారిశ్రామిక వాడల ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. వరంగల్‌లో కాకతీయ మెగాపార్కు, దండుమల్కాపురంలో మెగా ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటుతో పరిశ్రమల స్థాపనకు వౌలిక వసతులు కల్పిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ మాదిరిగా సముద్ర తీర ప్రాంతం లేకపోయినా డ్రైపోర్టు ఏర్పాటుతో పాటు హైవేల విస్తరణతో ఎగుమతులు, దిగుమతుల్లో ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం. అటు ఖాయిలా పడ్డ పరిశ్రమల పునరుద్ధరణకు దేశంలోనే ప్రప్రథమంగా సరికొత్త విధానం పారిశ్రామిక చికిత్స కేంద్రం(ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్)ను తీసుకవచ్చి మూతపడిన 15వేల చిన్న పరిశ్రమల పునరుద్ధరణకు ప్రభుత్వం చేయూతనిస్తుండగా తద్వారా 30వేల మంది వరకు ఉపాధి పొందే అవకాశం ఏర్పడనుంది. దళిత పారిశ్రామిక వేత్తలను ప్రొత్సహించేందుకు బ్యాంకులతో నిమిత్తం లేకుండా సబ్సిడీ రుణాలు అందిస్తున్నాం. చేతి వృత్తిదారులకు కూడా ప్రోత్సహం అందిస్తు చేనేతలకు నేతన్నకు చేయూత పథకం, పవర్‌లూం కార్మికులకు పొదుపు పథకం అమలు చేస్తున్నాం. పారిశ్రామికాభివృద్ధితో పాటు గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ బలోపేతంతో తలసరి ఆదాయం పెంచే లక్ష్యంగా కుల వృత్తుల అభివృద్ధికి ఆర్ధిక సహకారం ప్రభుత్వం అందిస్తుంది. ఇప్పటికే తలసరి ఆదాయంలో తెలంగాణ దేశంలోని తొలి పది రాష్ట్రాల్లో ఒకటిగా ఉంది. గ్రామీణ ప్రజల ఆదాయం పెంపుకు సబ్సిడీ గొర్రెలు, ఉచిత చేప పిల్లల పంపిణీ, పాడి పోషణకు ప్రోత్సహాకాలు, కార్పోరేషన్‌ల ద్వారా వివిధ వర్గాల వృత్తిదారులకు సబ్సిడీ రుణాలు అందిస్తున్నాం. ఇరిగేషన్ ప్రాజెక్టులు, విద్యుత్ ప్రాజెక్టులు, రైతులకు 24గంటల నిరంతర విద్యుత్, దిగుబడులకు మద్ధతుధర, ఎకరాకు పంటకు 4వేల పెట్టుబడి సాయం వంటి వాటితో పారిశ్రామికాభివృద్ధి, గ్రామీణ ఆర్ధికాభివృద్ధిలను సమాంతరంగా ముందుకు దూకిస్తు తెలంగాణ సమగ్రాభివృద్ధి లక్ష్యంగా కెసిఆర్ పక్కా ప్రణాళికలతో దార్శనీకతతో ముందుకు సాగుతున్నారు.
- జి.జగదీష్‌రెడ్డి తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి