ఫోకస్

కాకినాడ ఎంపిక సంతోషం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ నగరం తొలివిడత 20 నగరాల్లోనే స్మార్ట్‌సిటీగా ఎంపికవ్వడం సంతోషకరం. సహజ వాయువుల నిక్షేపాల కేంద్రంగా ఉండడంతో పాటు పెన్షనర్స్ పారడైజ్ గా గుర్తింపు పొందిన కాకినాడ ఇప్పుడు స్మార్ట్‌సిటిగా ఎంపికవ్వడం ద్వారా దేశంలోనే నెంబర్‌వన్ సిటిగా అభివృద్ధి చెందుతుంది.
వాస్తవానికి కాకినాడ తో పాటు పోటీ పడిన విశాఖపట్నం మనకన్నా అన్ని రంగాల్లో ముందున్నా తొలి 20 నగరాల్లో కాకినాడ చోటు దక్కించుకోవడం అభినందనీయం..
పారిశ్రామికంగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న కాకినాడను మరింత అభివృద్ధి చేసేందుకు స్మార్ట్‌సిటిగా ఎంపిక చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సహకారంతో ప్రధాని నరేంద్రమోడీ కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడును పలుమార్లు కోరడం జరిగింది. దీంతోపాటు కార్పోరేషన్ అధికార్లు , సిబ్బంది కష్టించి పనిచేసి కేంద్రానికి మెరుగైన ప్రతిపాదనలు పంపడంతో తొలి 20 నగరాల్లో కాకినాడ స్థానం దక్కించుకుంది.
స్మార్ట్‌సిటిగా ఎంపికైన కాకినాడను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఏడాది 200 కోట్లు చొప్పున ఐదేళ్లలో వెయ్యి కోట్లు నిధులు అందనున్నాయి. ఈ నిధుల ద్వారా కాకినాడలో నిరంతర మంచినీటి సరఫరా, అందరికీ ఇళ్లు, ఉపాధి అవకాశాలు, రహదారుల అభివృద్ధి , పార్కుల అభివృద్ధి , ఉప్పుటేరు కాలువను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు అవకాశం ఏర్పడుతుంది.
తొలి 20 నగరాలోల కాకినాడను స్మార్ట్‌సిటిగా ఎంపిక చేసినందుకు సహకరించిన ప్రధాని నరేంద్రమోడి, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కు ప్రత్యేక కృతజ్ఞతలు.

-తోట నరసింహం ఎంపి, కాకినాడ