ఫోకస్

తదుపరి జాబితాలో తిరుపతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో ప్రతిపాదించిన స్మార్ట్ సిటీల తొలి జాబితాలో ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, కాకినాడ పట్టణాలున్నాయ. 2015-16 ఆర్థిక సంవత్సరం నుండి ఈ పథకం కింద నిధులు లభిస్తాయి. దేశం మొత్తంలో 98 స్మార్ట్ సిటీలుగా గుర్తించారు. ఈ మొత్తంలో తొలి జాబితాలో ఆర్థిక చేయూత ఇచ్చేందుకు 20 నగరాలను ఎంపిక చేయగా ఎపిలోని రెండు నగరాలు ఇందుకు ఎంపికయ్యాయి. తర్వాతి దశలో తిరుపతిని కూడా ఎంపిక చేస్తారు. కేంద్రం ఇచ్చిన గైడ్‌లైన్స్‌కు లోబడి ఎపి నుండి స్మార్ట్ సిటీలకోసం ప్రతిపాదనలు పంపించాం. ఒక్కో నగరానికి 100 కోట్ల రూపాయలు లభిస్తాయి. స్మార్ట్ సిటీలుగా ఎంపిక చేసిన నగరాల్లో వివిధ రంగాల్లో డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించాల్సి ఉంటుంది. డిజిటల్ టెక్నాలజీ ఉపయోగించడంలో రవాణా, విద్యుత్తు, ఆరోగ్య రక్షణ, తాగునీటి సరఫరా, మురుగునీటి యాజమాన్యం తదితర రంగాలున్నాయి. ఆయా నగరాల్లో స్థానిక సంస్థలు పొదుపు పాటించడం, సహజ వనరుల వినియోగాన్ని వీలైనంత తగ్గిస్తూ, ప్రజలకు ఎక్కువ సదుపాయాలను కల్పించాల్సి ఉంటుంది. అలాగే నగరాల అభివృద్ధిలో ప్రజలను భాగస్వామ్యం చేసేందుకు ప్రణాళికలను రూపొందించి అమలు చేయాల్సి ఉంటుంది. ప్రజలకు మెరుగైన సేవలను అందాలన్నది కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం. ఈ కార్యక్రమం అమలు బాధ్యత కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో చేయాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ అధీనంలోని ‘స్మార్ట్ సిటీ మిషన్’ నేతృత్వంలో ఈ పథకం అమలవుతుంది. కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఈ మొత్త కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తుంది. గత ఏడాది కేంద్రం ఇచ్చిన నోటిఫికేషన్‌కు అనుగుణంగా ఎపి ప్రభుత్వం తరఫున స్మార్ట్ సిటీల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేశా. ప్రస్తుతం ప్రజలకు అందిస్తున్న సేవలు, ఇన్‌స్టిట్యూషనల్ సిస్టం, కెపాసిటీ బిల్డింగ్, ఉద్యోగులకు వేతనాలు ఇవ్వడం, ఆర్థిక పరిస్థితి, గతంలో కేంద్రం ప్రకటించిన జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం తదితర పథకాల అమలు ఏవిధంగా జరిగిందన్న అంశాలను పరిగణనలోకి తీసుకుని నివేదికలను కేంద్రానికి పంపించాం. వీటన్నింటినీ క్రోడీకరించి తొలి దశలో విశాఖపట్నం, కాకినాడ పట్టణాలను కేంద్రం ఎంపిక చేసింది. 2016 జనవరి 28న ప్రథమ జాబితా వెల్లడించారు. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు గ్రామీణ ప్రాంతాలతోపాటు, మరోవైపు పట్టణాలను అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో అనేక కార్యక్రమాల, పథకాలను చేపట్టింది. ఇప్పటికే రూపొందించిన ఏడు మిషన్లలో గ్రామాలు, పట్టణాల అభివృద్ధి అంశాలున్నాయి. కేంద్రం ఇచ్చే నిధులు పట్టణాల అభివృద్ధికి తోడ్పాటు అందిస్తాయనడంలో సందేహం లేదు. రాష్ట్రంలోని ఇతర పట్టణాలను కూడా అభివృద్ధి చేయాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. కేంద్రం సాయం అందినా, అందకపోయినా వివిధ పట్టణాల అభివృద్ధి జరగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

- ఐవైఆర్ కృష్ణారావు మాజీ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం