జాతీయ వార్తలు

త్వరలో సమగ్ర ఆహార విధానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంత్రి హర్‌సిమ్రత్ కౌర్ వెల్లడి
న్యూఢిల్లీ, డిసెంబర్ 17: రైతుల ఆదాయాన్ని పెంచడంతో పాటుగా వినియోగదారులకు సరసమైన ధరలకు ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలు లభ్యమయ్యేలా తోడ్పడేందుకు వీలుగా ఆహార రంగానికి ఒక సమగ్రమైన విధానాన్ని రూపొందించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. గురువారం ఇక్కడ అఖిల భారత ఫుడ్ ప్రాసెసర్ల అసోసియేషన్ సమావేశంలో కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ మాట్లాడుతూ, వ్యవసాయ క్షేత్రాలకు మార్కెట్, పరిశ్రమతో సంబంధాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. వ్యవసాయం, ఆహార పదార్థాల పంపిణీ, ఫుడ్‌ప్రాసెసింగ్ అన్నీ కలిసి ఉన్న ఒక సమగ్రమైన ఫుడ్ పాలసీ ఇప్పుడు అవసరమని తాను భావిస్తున్నానని, ఆ దిశగా ప్రభుత్వం యోచిస్తోందని ఆమె అన్నారు. రైతులు తమ ఆదాయాల స్థాయిని పెంచుకోవడానికి వీలుగా వ్యవసాయాన్ని మరింత లాభదాయకమైన వృత్తిగా మార్చాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు. 2020 నాటికి ఫుడ్‌ప్రాసెసింగ్ రంగానికి ఒక విజన్‌ను రూపొందించడానికి ప్రభుత్వం ఒక టాస్క్ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని అనుకుంటోందని ఆమె అన్నారు. అయితే ఇది నిరంతర ప్రక్రియ అని, రైతుల ఆదాయాల స్థాయి పెరిగే, ప్రాసెసింగ్‌ను ప్రోత్సహించే, అదే సమయంలో వినియోగదారులకు సరసమైన ధరలకు శుద్ధి చేసిన ఆహార పదార్థాలు లభ్యమయ్యే ఒక వాతావరణాన్ని సృష్టించాలన్నది ప్రభుత్వ ఉద్దేశమని కౌర్ అన్నారు. ఆహార రెగ్యులేటర్ ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ప్రాడక్ట్‌ల అప్రూవల్ విధానాన్ని సరళతరం చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, అంతేకాకుండా అహార ఉత్పత్తుల్లో చేర్చే మసాలా దినుసులకు అనుమతులు ఇచ్చినప్పుడు ఉత్పత్తిదారులు తమ ఉత్పత్తులకు తిరిగి ఆమోదం పొందాల్సిన అవసరం లేని ఒక కొత్త విధానాన్ని రూపొందించడానికి కృషి చేస్తోందని కూడా మంత్రి చెప్పారు.