సబ్ ఫీచర్

ఆహార భద్రత అతిముఖ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనది వ్యావసాయిక దేశం. 70 శాతం మంది ప్రజలు ఇప్పటికీ వ్యవసాయరంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. పూర్తిగా పారిశ్రామిక దేశంగా మారిపోయిందనుకోండి. అప్పుడు ఆహారాన్ని పండించేవారు కొరవడటంతో, తిండికి సంబంధించిన కొరత ఏర్పడక మానదు. పురాణకాలం నుంచీ కొనసాగుతున్న పరంపరాగత సంస్కృతి ప్రధానంగా వ్యవసాయాధారితంగా వృద్ధి చెందిదేనన్నది మరువరాదు. కృష్ణుడు గోపాలకుడైతే, బలరాముడు హలధారి. వీరిద్దరూ పాడిపండలకు అధిదేవతలు! మార్గదర్శకులు. పాడిపండలు రెండూ గోవు ఆధారిత వృత్తులే. సురేశ్ పాలేకర్ అధ్యయనం ప్రకారం ఒక్క గోవుతో 25 ఎకరాల వ్యవసాయం సుసాధ్యమేనన్నది స్పష్టమైంది. ఈమధ్యనే ఈ విధానంపై వివిధ పత్రికల్లో వార్తాకథనాలు వెలువడ్డాయి. రాయలసీమలోని అనంతపురం పట్టణానికి 16 కిలోమీటర్ల దూరంలో గల హంపాపురంలో ఒకరు 120 ఎకరాలలో ‘పాడి-పంట-ప్రకృతి’ వ్యవసాయ క్షేత్రాన్ని స్థాపించారు.
ఆవుపేడ, మూత్రంతో జీవామృతం, బీజామృతం వంటి సేంద్రీయ ఎరువులతో, సుభాష్ పాలేకర్ స్ఫూర్తితో వ్యవసాయాన్ని కొనసాగిస్తూ, పాశ్చాత్య విద్యాధికులైన రామకృష్ణ అద్భుతమైన ఫలితాలను సాధిస్తున్నారు. మరో ఉదాహరణను పరిశీలిద్దాం. మహబూబ్ నగర్ జిల్లా తెలకపల్లి మండలం, కార్వంగ గ్రామంలో అక్కడి వ్యవసాయాధికారి చొరవతో, ఒక మహిళా రైతు ఒక ఆవును కొని, మురిగిన కోడిగుడ్లు- గోమూత్రంతో తయారు చేసిన కషాయం, పంటలకు పిచికారీ చేసి, ఫలితాలను సాధించింది. ఒక్క ఆవుతో 30 ఎకరాలకు సరిపడ సేంద్రీయ ఎరువులు తయారు చేసుకోవచ్చు అంటోందీ మహిళా రైతు.
రసాయనిక ఎరువులు వాడితే ఎకరాకు రూ.25వేలు ఖర్చవుతుంది. అదే సేంద్రీయ ఎరువులైతే ఖర్చు రూ.10వేలకు తగ్గిపోతుంది. పైగా అంతర పంటలుగా ధనియాలు, మెంతులు, ఆవాలు వేసిందట. ఈ సంవత్సరం వర్షాలు లేక, ఎకరాకి రెండు క్వింటాళ్ల పత్తి కూడా రాలేదు...కానీ తాను వేసిన నాన్-బిటి పత్తి, సేంద్రీయ వ్యవసాయ పద్ధతులతో పది క్వింటాళ్లు దిగుబడి వచ్చిందట. తానీ పద్ధతుల ద్వారా, సేంద్రీయ వ్యవసాయాన్ని నమ్ముకొనడంతో, పదెకరాలతో వ్యవసాయాన్ని ప్రారంభించిన తాను ఇప్పుడు 30 ఎకరాల ఆసామినయ్యానంటూ ఆమె సగర్వంగా చెబుతోంది. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఈ మహిళా రైతు పేరు లావణ్య.
వివిధ పత్రికల్లో వచ్చిన అంశాల ప్రస్తావన ఇప్పుడెందుకు? అని ప్రశ్నించవచ్చు. అందుకు సమాధానం ఒక్కటే. డిసెంబర్ 10వ తేదీన ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు ‘బీఫ్ ఫెస్టివల్’ జరుపుతామని ప్రకటించడం ఇందుకు నేపథ్యం. నిజానికి ఈ నిర్ణయాన్ని బలపరుస్తున్న విద్యార్థులలో ఎంతమంది రైతుబిడ్డలున్నారు? వారికీ విషయాలు తెలియవా? వారు వద్దన్నారు కాబట్టి మేం చేసి తీరుతామన్నది కాదు అసలు ప్రశ్న. వ్యవసాయానికి, రసాయన దుష్ఫలితాలకు ఆస్కారంలేని సాగుకు మూలాధారమైన గోసంతతిని ధ్వంసం చేసే ఈ ధోరణి బలపరచదగిందేనా?...ఇది ఏదో కేవలం హిందువుల సమస్య కాదు. దేశానికి సంబంధించిన సమస్య!
పురాతన కాలం నుంచి వ్యవసాయానికి పనికి వచ్చే జంతువులకు మానవుడు అత్యంత ప్రాధాన్యతనిస్తూ వచ్చాడు. క్రమంగా యాంత్రీకరణ పెరిగేసరికి, వాటి ప్రాధాన్యత తగ్గి, ఇటువంటి విపరిణామాలు చోటు చేసుకుంటున్నాయ. నిజంగా రైతు బిడ్డ అన్నవాడు ఇటుంవటి వాటికి ఒప్పుకోడు. ఎందుకంటే వాటి విలువ తెలుసు కనుక. ఈ విషయాలు విశ్వవిద్యాలయ అధికార్లకు తెలియవా? అసలు ఏ విందులకైనా విశ్వవిద్యాలయాలు అనుమతులివ్వడమేంటి? ఆవి విద్యాలయాలు కాని, విందు భోజనాలు జరుపుకునే ప్రదేశాలు కావే! జంటనగరాలో అటువంటివాటిని నిర్వహించుకునేందుకు ఇతర ప్రదేశాలు ఉన్నాయి కదా! ఎవరికి ఇష్టమై ఆహారం వారు తీసుకున్నా, అది దేశ ఆహార భద్రతకు ప్రమాదం కలిగించేదయితే, ఇష్టాయిష్టాల ప్రసక్తే ఉండకూడదు.

- చాణక్య