Others
ఫుట్‌బాల్‌లో అదితి అద్వితీయ ఘనత
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
దేశ రాజధాని దిల్లీకి చెందిన అదితి చౌహాన్ 2015 సంవత్సరానికి సంబంధించి ‘ఆసియా ప్రాంత ఉత్తమ ఫుట్‌బాల్ క్రీడాకారిణి’ అవార్డును కైవసం చేసుకుంది. ఈ అవార్డును అందుకున్న తొలి భారతీయురాలిగా ఆమె చరిత్ర సృష్టించింది. లండన్‌లో జరిగే ఆసియన్ ఫుట్‌బాల్ అవార్డుల ప్రదానోత్సవానికి ఆమె ఎంపికైంది. ఫుట్‌బాల్‌పై అమితాసక్తి కలిగిన అదితి రెండేళ్ల క్రితం లండన్ వెళ్లి లాబొరో విశ్వవిద్యాలయంలో ‘స్పోర్ట్సు మేనేజ్‌మెంట్’లో పీజీ కోర్సులో చేరింది. ఆ విశ్వవిద్యాలయం ఫుట్‌బాల్ జట్టులో స్థానం లభించాక వివిధ టోర్నమెంట్లలో గోల్ కీపర్‌గా అద్భుత ప్రతిభ చూపింది. వెస్ట్ హామ్ లేడీస్ జట్టులో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో పాల్గొన్న తొలి భారతీయురాలిగా క్రీడాభిమానుల ప్రశంసలు అందుకుంది. ‘ఆసియా ప్రాంత ఉత్తమ క్రీడాకారిణి’ అవార్డు రావడంతో మరిన్ని టోర్నమెంట్లలో సత్తా చూపేందుకు తనలో ఉత్సాహం పెరిగిందని అదితి చెబుతోంది. వీసాకి సంబంధించి యుకెలో కొన్ని సమస్యలు ఎదురైనప్పటికీ తాను అక్కడ ఫుట్‌బాల్ టోర్నమెంట్స్‌కు స్వస్తి చెప్పేది లేదని ఆమె తెలిపింది. భారత్‌లోనూ మహిళలు అంతర్జాతీయ ఫుట్‌బాల్ టోర్నీల్లో రాణించి సొంతగడ్డకు పేరు ప్రఖ్యాతులు తేవాలని తాను కోరుకుంటున్నానని అదితి తన అంతరంగాన్ని ఆవిష్కరించింది.