అంతర్జాతీయం

ఫోర్బ్స్ బిజినెస్ జాబితాలో భారత్‌కు 97వ స్థానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, డిసెంబర్ 17: ఫోర్బ్స్ 2015 బెస్ట్ బిజినెస్ జాబితాలో భారత్ 97వ స్థానంలో నిలిచింది. మొత్తం 144 దేశాల జాబితాలో కజకిస్తాన్, ఘనా దేశాల కంటే వెనకబడి ఉండడం గమనార్హం. ఫోర్బ్స్ వార్షిక జాబితాలో డెన్మార్క్ మొదటి స్థానంలో నిలిచింది. అమెరికా అయితే నాలుగో స్థానం నుంచి 22కి పడిపోయింది. అమెరికాకు ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదు. ఆరేళ్ల నుంచి అంటే 2009 నుంచి అమెరికా రెండో స్థానంలోనే ఉండేది. 17.5 ట్రిలియన్ల (యుఎస్‌డి)తో ప్రపంచంలోనే అమెరికా ఆర్థిక రాజధానికిగా ఉంటోంది. తరువాత స్థానం చైనాది. ద్రవ్యపరమైన స్వేచ్ఛ, అధికార యంత్రాంగంలో నిర్లిప్తత, రెడ్‌టేపిజం వల్ల అమెరికా పనితీరు మందగించిందని ఫోర్బ్స్ వెల్లడించింది. భారత్ దీర్ఘకాలిక వృద్ధి పరోగమన దిశగానే సాగుతోందని ఒక ప్రకటనలో తెలిపారు. తన ముందున్న అనేక సవాళ్లను భారత్ ఎదుర్కోవల్సి ఉందని పేర్కొంది. పేదరికం, అవినీతి, హింస, మహిళలు, బాలికల పట్ల వివక్ష, విద్యుత్ ఉత్పత్తి పంపిణీలో వ్యవస్థ లోపభూయిష్టం, రవాణా, వౌలిక సదుపాయల కల్పనలో వెనకబాటుతనం, వ్యవసాయేతర రంగాల్లో పరిమితమైన ఉపాధి కల్పన వంటి సవాళ్లను భారత్ ముందున్నాయని ఫోర్బ్స్ తెలిపింది. అంతేకాకుండా సబ్సిడీ పథకాలపై పెద్ద మొత్తంలో వ్యయం, ప్రాధమిక, ఉన్న విద్యరంగంలో ప్రమాణాలు తక్కువంగా ఉండడం, పల్లెల నుంచి పట్టణాలకు వలసలు వంటి సమస్యలు దేశంలో ఉన్నాయని స్పష్టం చేశారు. అయితే కొన్ని రంగాల్లో పరిస్థితులు మెరుగ్గా ఉన్నాయన్నారు. పెట్టుబడులకు పూర్తి రక్షణలో ఎనిమిదో స్థానంలో నిలిచింది. ఇన్నోవేషన్స్‌లో 41, వ్యిక్తి స్వేచ్ఛలో 57, ఆస్తి హక్కుల్లో 61 స్థానంలో నిలిచింది. స్వేచ్ఛాయుత వాణిజ్యం నిరాశాజనంగానే ఉంది. ఇందులో 125వ ర్యాంకు, ద్రవ్యపరమైన స్వేచ్ఛలో భారత్ 139 స్థానంలో నిలిచింది. యుకె 10, జపాన్ 23వ ర్యాంకులు దక్కించుకున్నాయి.