రాష్ట్రీయం

అడవులే మనకు రక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 11: అడవులను రక్షించుకోవడానికి, చెట్లను పెంచడానికి, వన్య ప్రాణులను కాపాడుకోవడానికి కంకణ బద్దులై పనిచేయాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 11న నిర్వహించిన అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సిఎం తన సందేశాన్ని విడుదల చేశారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అనేక పరిణామాల వల్ల అడవుల శాతం తగ్గి వాతావరణ సమతుల్యత దెబ్బతిందని సిఎం పేర్కొన్నారు. దీని వల్ల రక్షణ కవచకంగా ఉన్న ఓజోన్ పొర పలచబడి అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయన్నారు. అడవులు, వన్యప్రాణుల రక్షణకు ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుందన్నారు. చిత్తశుద్ధి కలిగిన అధికారులు ఎందరో ప్రాణాలను ఫణంగాపెట్టి వన సంపదను కాపాడుతున్నారన్నారు. ఈ క్రమంలో అనేక మంది అటవీశాఖ అధికారులు స్మగ్లర్ల చేతిలో, ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అటవీశాఖ అధికారులను స్మరించుకోవడానికి, వారిని స్ఫూర్తిగా తీసుకోవడానికి అటవీ అధికారుల అమరవీరుల సంస్మరణను జరుపుకోవడం ఏటా అనవాయితీగా వస్తుందని సిఎం పేర్కొన్నారు.
ఇలాఉండగా హైదరాబాద్ నెహ్రు జులాజికల్ పార్క్‌లో అటవీశాఖ అధికారుల అమరవీరుల సంస్కరణను పురస్కరించుకుని మంత్రి జోగురామన్న ఆదివారం నివాళి ఆర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అటవీశాఖను బలోపేతం చేయడానికి సిబ్బందికి ఆయుధాలు సమకూర్చుతున్నామన్నారు. కలప అక్రమ రవాణా అరికట్టడానికి స్మగ్లర్లపై పిడి చట్టాన్ని ప్రయోగిస్తున్నామన్నారు. గత ప్రభుత్వాలు అటవీశాఖను నిర్లక్ష్యం చేసినప్పటికీ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సిబ్బందికి 2143 వాహనాలు సమకూర్చామని మంత్రి అన్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా 29 కోట్ల మొక్కలను ఈ ఏడాదిలో నాటామన్నారు. దీని కోసం రూ.105 కోట్లు కేటాయించామన్నారు. అమూల్యమైన అటవీ సంపదను కాపాడుకోవడానికి 144 బేస్ క్యాంపులు, 62 స్ట్రైకింగ్ ఫోర్స్‌లను, 57 చెక్ పోస్టులను ఏర్పాటు చేశామన్నారు. సాయుధ పోలీసు దళాల ద్వారా కలప అక్రమ రవాణాను అరికట్టడానికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి జోగురామన్న చెప్పారు.

చిత్రం... జూపార్కులో అటవీ అమరవీరుల స్థూపం వద్ద నివాళి అర్పిస్తున్న మంత్రి జోగు రామన్న