జాతీయ వార్తలు

పిల్లలకూ ఫుల్‌చార్జ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీటు/బెర్త్ కావాలంటే కట్టాల్సిందే
రైల్వే నిర్ణయం.. ఏప్రిల్ నుంచి అమలు
న్యూఢిల్లీ, డిసెంబర్ 4:పిల్లలు కాబట్టి రైల్వే రిజర్వేషన్ టికెట్ రేటు సగమే ఉంటుందని ఇంకెంత మాత్రం భావించడానికి వీల్లేని పరిస్థితి రాబోతోంది! 5-12 సంవత్సరాల లోపు పిల్లల విషయంలో సగం రేటే ఇప్పటి వరకూ వసులు చేసిన రైల్వేలు ఇక నుంచి వీరికీ పెద్దలతో సమానంగా రిజర్వేషన్ చార్జీలను అమలులోకి తీసుకురాబోతున్నాయి. ఇందుకు వీలు కల్పించే విధంగా వచ్చే ఏప్రిల్ నుంచి కొత్త విధానం అమలులోకి వస్తోంది. పిల్లల రైలు చార్జీల నిబంధనను కూడా తదనుగుణంగా అధికారులు సవరించారు. మారిన విధానం ప్రకారం..రిజర్వేషన్ సమయంలో 5-12 సంవత్సరాల లోపు పిల్లలకూ సీటు లేదా బెర్త్ కోరే పక్షంలో వారికీ పూర్తి స్థాయి చార్జిని వసూలు చేస్తారు. రిజర్వేషన్‌తో నిమిత్తం లేని టికెట్ల విషయంలో మాత్రం పిల్లలకు సగం రేటే చెల్లించాల్సి ఉంటుంది. వచ్చే ఏప్రిల్ నుంచి కొత్త విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించినప్పటికీ కచ్చితమైన తేదీని తదుపరి నోటిఫికేషన్‌లో ప్రకటిస్తామని రైల్వే శాఖ తెలిపింది. పిల్లలకూ సీటు లేదా బెర్త్ అవసరాన్ని నిర్దేశించే విధంగా రిజర్వేషన్ ఫాంలో తగిన మార్పులు చేస్తామని వెల్లడించింది. ఐదేళ్ల లోపు పిల్లలు ఉచితంగానే రైళ్లలో ప్రయాణించే విధానం యథాతథంగా కొనసాగుతుంది తెలిపింది.