విశాఖపట్నం

జెడ్పీకి నిధుల కొరత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 25: ప్రతీ ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా జిల్లా పరిషత్‌కు నిధులు మంజూరవుతాయని ఆశించినప్పటికీ ఆర్థిక సంఘం నిధులు విడుదల కాకపోవడంతో అభివృద్ధి పనులు కుంటుపడ్డాయి. ఈ ఏడాది ప్రభుత్వం 14వ ఆర్థిక సంఘం నిధులను నేరుగా పంచాయతీలకు మంజూరు చేయడంతో జెడ్పీ ద్వారా చేపట్టే అభివృద్ధి పనులకు నిధుల కొరత ఎదురైంది. పంచాయతీలతోపాటు తమకు కూడా ఆర్థిక సంఘం నిధులను విడుదల చేయాలని కేంద్రం వద్ద మొరపెట్టుకున్నప్పటికీ ఫలితం లేకపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా పరిషత్ చైర్మన్లు అందరు కలసి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్ర ప్రభుత్వానికి పలుమార్లు విన్నవించారు. అయితే ప్రధాని మోదీ మాత్రం ఈ ఏడాది ఆర్థిక సంఘం నిధులను నేరుగా పంచాయతీలకు విడుదల చేస్తామని, జిల్లా పరిషత్‌లకు ఈ ఏడాది నిధులు మంజూరు చేయలేమని స్పష్టం చేయడంతో జెడ్పీ చైర్మన్లు ఉసూరుమంటు వెనుదిరిగారు. ప్రస్తుతం జిల్లా పరిషత్‌లకు ప్రత్యేక నిధులు మంజూరు కాకపోవడంతో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేకపోతున్నామని ఎంపిపిలు, జెడ్పీ చైర్మన్లు వాపోతున్నారు. నూతన సంవత్సరంలోనైనా జెడ్పీలకు నిధులు మంజూరవుతాయని ఆశగా ఎదురుచూస్తున్నారు.
ప్రస్తుతం జెడ్పీకి తలసరి గ్రాంటు, ఆర్థిక సంఘం, ప్రత్యేక గ్రాంటులపై ఆధారపడి పనులు చేపట్టాల్సి ఉంది. అయితే ఆర్థిక సంఘం నిధులు విడుదల కాకపోవడంతో తలసరి గ్రాంటు, ప్రత్యేక గ్రాంటులతో అభివృద్ధి పనులు చేపట్టాల్సి వచ్చింది. అయితే ప్రస్తుతం అవసరాలకు తగిన విధంగా నిధులు మంజూరు గాకపోవడంతో అభివృద్ధి పనులు అరకొరగా సాగుతున్నాయి. ఉపాధి హామీ పథకం నిధులతో చేయదగిన పనులను చేపడుతున్నారు. అవి మినహా మిగిలిన పనుల జోలికి పోవడం లేదు. ఏది ఏమైనప్పటికీ జెడ్పీలకు ఈ ఏడాది మొండి చేయి మిగిలిందని చెప్పవచ్చు.