ఆంధ్రప్రదేశ్‌

ఈ నిధులు ఏ మూలకు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజధానికి రూ.1500 కోట్ల కేటాయంపుపై సర్వత్రా అసంతృప్తి

గుంటూరు, మార్చి 10: రాష్ట్రప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రాజధానికి కేవలం రూ.1500 కోట్లు కేటాయించటంపై రైతుల్లో నిరాశ నెలకొంది. రాజధాని నిర్మాణాలు శరవేగంగా జరిగితే భూములకు రేట్లు వస్తాయని, పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు ముందుకు వస్తాయనే ఆలోచనల్లో రైతులు ఉన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ రాజధాని ఊసే లేకుండా వ్యవహరించటంపై నిస్పృహకు లోనైన రైతులు మరోసారి డీలా పడ్డారు. రాష్ట్రప్రభుత్వం ప్రపంచస్థాయి రాజధాని నిర్మిస్తామని చేస్తున్న ప్రకటనలకూ, వాస్తవ రూపంలో కేటాయిస్తున్న నిధులకు పొంతన లేదనే విమర్శలు సర్వత్రా ఊపందుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం జనాన్ని అన్ని విధాలా మోసం చేస్తోందని పెనుమాక రైతు నరేష్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కనీసం రూ.15,000 కోట్లు కేటాయించాల్సి ఉండగా, రూ.1500 కోట్లు కేటాయించడం దారుణమన్నారు. ఇప్పటికే భూముల రేట్లు పడిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉండవల్లి రైతు ఎన్ నాగేశ్వరరావు మాట్లాడుతూ 2018 నాటికి రాజధాని నిర్మిస్తామని ప్రకటిస్తున్న ప్రభుత్వం అరకొర నిధులతో ఎలా నిర్మాణాలను కొనసాగిస్తుందో అర్థం కావటం లేదన్నారు. తాత్కాలిక సచివాలయ నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేస్తున్న ప్రభుత్వం రాజధాని నిర్మాణాలకు మాత్రం ప్రపంచ బ్యాంకు నిధుల కోసం వెంపర్లాడటం తగదన్నారు. నిర్మాణాలు పూర్తి చేయకుడా వచ్చే ఎన్నికల్లో రాజధాని అంశాన్ని ప్రచారాస్త్రంగా వాడుకోవాలనే కుట్రపూరిత ఉద్దేశ్యంలో రాష్ట్రప్రభుత్వం ఉందని రైతు నాగేశ్వరరావు విమర్శించారు.
తూతూ మంత్రంగా బడ్జెట్: ఎమ్మెల్యే అర్కే
రాష్ట్రప్రభుత్వం తూతూ మంత్రంగా బడ్జెట్‌ను రూపొందించిందని వైస్సార్ కాంగ్రెస్ పార్టీ మంగళగిరి నియోజకవర్గ శాసనసభ్యుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) విమర్శించారు. రాజధానికి రూ.1500 కోట్లు కేటాయించి నిర్మాణాలు కొనసాగించటం అసాధ్యమన్నారు. విభజన చట్టం ప్రకారం కేంద్రం సహకరించాల్సి ఉండగా, రాజ్యాంగ హక్కులను సాధించుకునే దిశగా రాష్ట్రప్రభుత్వం వ్యవహరించటం లేదన్నారు. రాజధాని నిర్మాణాలకు నిధులు లేకపోతే పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు రారని, దాని కారణంగా భూములిచ్చిన రైతులు నష్టపోతారన్నారు.
ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాస్తామని ప్రకటించిన రాష్ట్రప్రభుత్వానికి కేంద్రం నిధుల కేటాయింపులో మొండి చెయ్యి చూపించిందని రాజధాని ప్రాంత సిపిఎం కన్వీనర్ సిహెచ్ బాబూరావు వ్యాఖ్యానించారు. రాజధాని నిర్మాణాలకు రూ.42,000 కోట్లు కావాలని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో కేవలం రూ.1500 కోట్లు కేటాయిస్తే రాజధాని నిర్మాణాన్ని ఎనే్నళ్లకు పూర్తిచేస్తారో అర్థం కావడం లేదన్నారు. రాజధాని నిర్మాణాలకు 33 వేల ఎకరాలు ఇచ్చిన రైతులను నిరాశ్రయులను చేసే విధంగా కేటాయింపులు ఉన్నాయన్నారు. రియల్‌ఎస్టేట్ వ్యాపారానికి ఆస్కారం ఉందనే రైతుల విమర్శలకు ఊతమిచ్చే విధంగా సింగపూర్, జపాన్, ప్రపంచ బ్యాంకుల నిధులు తీసుకువచ్చి రాజధానిని నిర్మిస్తే ప్రజలు అన్యాయం అయిపోతారని విమర్శించారు. ఇప్పటికైనా కేంద్రంపై ఒత్తిడి తెచ్చి నిధులు తీసుకురావాలన్నారు.