తెలంగాణ

గ్రేటర్ ఎన్నికల్లో టిడిపినే కింగ్ మేకర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 22: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టిడిపినే కింగ్ మేకర్ అవుతుందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు శుక్రవారం శిక్షణా తరగతి ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ వారికి ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, ప్రచారం వంటి సలహాలు, సూచనలు చేశారు. ఎన్నికల్లో తమ పార్టీ పాదర్శకంగా సీట్లు కేటాయించిందని ఆయన చెప్పారు. అయితే కొంత మంది నాయకులు ప్రతిభ లేక ఇతర పార్టీల్లోకి వెళ్ళారని ఆయన విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఏమి చేసిందో, నగరాభివృద్ధికి చేపట్టిన కార్యక్రమాలు ఏమిటో వివరించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజాగ్రహుం వల్లే ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సచివాలయానికి రావడం లేదని అన్నారు. టిటిడిపి అధ్యక్షుడు ఎల్. రమణ మాట్లాడుతూ జిహెచ్‌ఎంసి నిధులను ప్రభుత్వం ఇతర కార్యక్రమాలకు మళ్లిస్తున్నదని విమర్శించారు. భూతద్దం పెట్టి వెతికినా రాష్ట్ర ప్రనుత్వం చేసిన అభివృద్ధి ఏమిటో కనిపించడం లేదని ఆయన అన్నారు.