మెయన్ ఫీచర్

గణతంత్రాన్ని కాపాడుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనం తిరుమల కొండ ఎక్కుతుంటే ప్రతిచోట ‘్ధర్మోరక్షతి రక్షితః’ అనే సూక్తి కన్పడుతుంది. ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనలను రక్షిస్తుంది అని ఈ సంస్కృత సూక్తికి అర్ధం. అంటే భారత రాజ్యాంగాన్ని మనం రక్షిస్తే రా జ్యాంగం మనలను కాపాడుతుంది అని తాత్పర్యం. 2016 గణతంత్ర దినోత్సవ సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాతలను స్మరించుకొని వారికి కృతజ్ఞతలు చెప్పుకోవాల్సి ఉంది. ప్రపంచంలోని శ్రేష్టరాజ్యాంగాలల్లో భారత రాజ్యాంగం ఒకటి. ఇది 1950 జనవరి 26నుండి అమలులోకి వచ్చింది.
భారత రాజ్యాంగంలోని మొదటి రెండు అధ్యాయాలు ఇందుకోసం కేటాయించారు. మొదటి అధ్యాయాన్ని రెండవ అధ్యాయం వ్యాఖ్యానిస్తుంది. రాజ్యాంగంలోని ఆరవ అధ్యాయంలోని రెండవ భాగం లో 72-122 మధ్యగల నిబంధనలు పార్లమెంటు నిర్మాణాన్ని సూచిస్తాయి. అంటే పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలోని ఎన్నికల ప్రక్రియ కేంద్ర ప్రభుత్వం మంత్రుల నియామకం వాటి హక్కులు బాధ్యతలు అన్నీ అసందిగ్ధంగా నిర్వచించారు. అంతేకాదు మన ఫెడరేషన్ (సమాఖ్య)లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంబంధాలు కూడా రాజ్యాంగంలో స్పష్టంగా ని ర్వచించారు. సంక్షేమ రాజ్యం (వెల్‌ఫేర్ స్టేట్) మన లక్ష్యం అని చెప్పారు. ఇందులో ప్రభుత్వరంగ- ప్రైవేటు రంగ సంస్థల పరిమితులు పనితీరు- అత్యవసర పరిస్థితిలో నిర్వర్తించాల్సిన విధులు, న్యాయవ్యవస్థ నిర్మాణం వాటి పనితీరు పరిధి- వ్యక్తిస్వాతంత్య్రం- పత్రికా స్వాతం త్య్రం వంటి అంశాలన్నింటినీ (ద్వితీయాధ్యాయం) చాలా స్పష్టంగా నిర్వచించారు.
ప్రాచీన భారతంలో లిఖిత రాజ్యాంగాలు ఏవని రాజు స్థూలంగా తన అభీష్టానుసారం పాలించేవాడని ఒక అభిప్రాయం సమాజంలో ఉంది. పురోహిత వర్గాల సహాయంలో రాజ్యవ్యవస్థ నడిచేదనే దుర్భావనను సూడో సెక్యులరిష్టులు బలంగా ప్రచా రం చేశారు. ఇందుకు కారణాలు బ్రిటన్ వంటి దేశాలల్లో రాజుకు పోపుకు మధ్య జరిగిన మత యుద్ధాలు. భారతదేశంలో అ లాంటి పరిస్థితి లేదు. అంతేకాదు రాజ్యాంగాలు యుగయుగాలల్లోనూ మారుతూ వచ్చాయి. మనుస్మృతి తర్వాతి కాలంలో పరాశరస్మృతి, శంబ లిఖిత స్మృతి వంటివి ఎన్నో వచ్చాయి. ఆమాటకొస్తే 1950నాడు అంబేద్కర్ నేతృత్వంలో రూపొందింపబడిన రాజ్యాంగం ఈ డెబ్బది సంవత్సరాలల్లోనే తొమ్మిదిసార్లు మార్చబడింది. కాబట్టి సారాంశమేమంటే రాజ్యాంగాలు ప్రజలకోసం ఏర్పడి ప్రజాసంక్షేమానే్న పరిరక్షించేందుకోసం నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటాయ. వివిధ దేశాలు తమతమ సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా రాజ్యాంగాలు రూపొందించుకుంటాయి. రాజ్యాంగం అంటే రాజ్యంలో అంతర్భాగమైన పౌరుల అనూహ్య సంబంధాన్ని నిర్ధారించే పద్ధతినే రాజ్యాంగం అని పిలుస్తారు అన్నాడు గ్రీకు తత్త్వవేత్త అరిస్టాటిల్.
ఆధునిక భారత రాజ్యాంగం రూపొందించడానికి ముందు 1857లో విక్టోరియా రాణి భారత కౌన్సిల్ తర్వాత 1861, 1892, 1909, 1919, 1935లల్లో కొన్ని ప్రభుత్వ చట్టాలు వచ్చాయి. వాటిని గమనించి 1950లో సర్వసత్తాక రాజ్యాంగం భారత్‌కు ఏర్పడింది. 1919లో రష్యా బోల్షవిక్ విప్లవం, తర్వాత 1948లో చైనాలో మావో రూపొందించిన రాజ్యాంగాలు గతంలోని తమ దేశ చరిత్రకూ సంస్కృతికి ఎటువంటి సంబంధమూ లేనివిగా వారే నిర్ణయించారు. 2015లో నేపాల్‌లో సరిగ్గా అలాగే జరిగింది. చాలా దేశాల్లో సమాఖ్యలు కేంద్రంలో ఘర్షణకు దిగి స్వతంత్ర దేశాలుగా విడిపోవటం కూడా జరిగింది. అట్టి పోకడలను మన దేశంలో రాకుండా చూడా లి. ముఖ్యంగా తమిళనాడు కేరళ బెంగాల్ రాష్ట్రాలు నిరంతరం కేంద్రంతో సైద్ధాంతికంగా విభేదిస్తూనే వచ్చాయి. సమాఖ్యలో రాష్ట్రాలు మరీ బలపడితే రష్యాకు పట్టిన గతే మనకూ పడుతుంది. దీనికి విరుగుడుగా రాజకీయాలకు అతీతంగా సాంస్కృతిక జాతీ య వాదాన్ని ప్రోత్సహించవలసి ఉంది. భారత రాజ్యాంగంలో మూడవ భాగంలో 12నుండి 32 వరకు గల అధికరణాలు ప్రాథమిక హక్కులను నిర్వచించాయి. ఐతే ప్రజలు హక్కుల పేరుతో బాధ్యతలు మరచిపోవటంతో 42వ భారత రాజ్యాంగ సవరణ ద్వారా పౌరులు నిర్వహించవలసిన ప్రాథమిక బాధ్యతలను వివరించి చెప్పింది. ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. ప్రాథమిక హక్కులకు వ్యాఖ్యానంగా నిర్దేశక సూత్రాలల్లో 19-1-ఎ వ్యక్తి భావ పత్రికా స్వాతంత్య్రాలు ప్రసాదించారు. ఇవి అపరిమితం కాదు. నా స్వాతం్ర త్యం నీ స్వాతంత్య్రాన్ని హరించేది కాకూడదు- అది గమనించినప్పుడు చట్టసభలలోనూ ఎన్నికల ర్యాలీలల్లోనూ అశ్లీల ప్రసంగాలు ఉండవు. ఉంటే రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతున్నదని అర్థం.
ద్వితీయాధ్యాయంలోని 48వ అధికరణంలో పర్యావరణ పశుసంరక్షణ వివరాలున్నాయి. మరి ఈ అధికరణం ఎవరూ పాటించటం లేదు సరికదా ఎవరైనా పాటిస్తే వారిని కమ్యూనల్ అంటున్నారు. రాజ్యాంగంలోని 4వ భాగంలో 36 నుండి 51వరకు నిర్దేశక నియమాలు పేర్కొన్నారు. రాజ్యాం గ ప్రవేశికలోని ఆదర్శాల సాధనను ఇవి విస్తరిస్తాయి వ్యాఖ్యానిస్తాయి. వీటికే ‘నిర్దేశక’లేక ఆదేశిక సూత్రాలు అని పేరు. వీటిని 1) శ్రేయోరాజ్యస్థాపన 2) శాసనసభల విధివిధానాలు 3) చట్టాలు 4) ఆర్థిక వనరులు 5) రాజకీయ పార్టీల స్వీయ ఎజండాలకు అతీతంగా ఆయా ప్రభుత్వాలు ఎలా వ్యవహరించాలో ఈ అధికరణాలు నిర్దేశిస్తాయి. వీటిని వివిధ రాష్ట్రప్రభుత్వాలు సమర్ధవంతంగా నిర్వహించకపోవడానికి కారణం ఆయా పార్టీల స్వీయఎజెండాలే.
మధ్యప్రదేశ్‌లో భోజశాల అనేచోట ఒక సరస్వతీదేవాలయం ఉంది. అక్కడ ముస్లిములు మసీదు కట్టి నమాజులు చేస్తున్నా రు. ఇప్పుడది వివాదాంశంగా మారింది. అంటే భోజశాల మరో అయోధ్యగా మారబోతున్నదని అర్థం. ఇది మతపరంగా భా వోద్రేకాలను రెచ్చగొట్టే అంశం. కాశ్మీరులోనూ అలాగే జరిగింది. 1990లో వేలాది కాశ్మీరీ పండిట్లు కట్టుబట్టలతో కాందిశీకులై తమ జన్మస్థలాలు వదిలి పెట్టి ఢిల్లీకి వలసవచ్చారు. అంటే ఇక్కడ పాకిస్తాన్ విజయం సాధించింది అని అర్థం. అలాగే అరుణాచలప్రదేశ్‌లో చైనా భారత రాజ్యాంగాన్ని అమలుకాకుండా చూస్తున్నది. ఉత్తరప్రదేశ్‌లో దాద్రీ అనేచోట ఒక పశువుల దొంగను స్థానికులు రాళ్లతోకొట్టి చంపితే మొత్తం భారతదేశంలోనూ మైనారిటీ మెజారిటీ అనే విభజన (పోలరైజేషన్) వచ్చింది. హైదరాబాదు కేంద్ర విద్యాలయంలో రోహిత్ వేముల అనే వడ్డెర కులస్థుడు మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంటే రాజకీయ నాయకులు మొత్తం దేశాన్ని దళిత- దళితేతర- అనే రెండువర్గాల కింద విభజించటంలో విజయం సాధించారు.
చెన్నై వరదల్లో దళిత కేంద్ర మాజీమంత్రి నారాయణస్వామి చేత రాహుల్‌గాంధీ చెప్పులు మోయించటం అందరికీ తెలుసు. ఆయన తల్లి సీతారాంకేసరిని ఎలా అవమానించిందో తెలియదా? బేగంపేట విమానాశ్రయంలో అమాయకుడైన ఆంధ్రప్రదేశ్ దళిత ముఖ్యమంత్రి టి.అంజయ్యను పరాభవించిందెవరు?? భారతదేశంలో దళితులపై అత్యాచారాలు జరిగే రాష్ట్రాలల్లో బిహారు- ఉత్తరప్రదేశ్ ప్రథమస్థానంలో ఉన్నాయి. సున్నం రాజయ్య అనే దళిత కాంగ్రెసు ఎం.పి. తన కోడలు సారికను హింసిస్తే ఆమె బిడ్డలతో సహా ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. అప్పుడు రాహుల్‌గాంధీ వరంగల్ వచ్చి ఎందుకు ఓదార్పుయాత్ర చేయలేదు?? రాజ్యాంగోల్లంఘన చేసి ప్రాథమిక హక్కులు హరించి దేశం మీద ఎమర్జెన్సీ విధించినవారు కూడా ఇప్పుడు రెచ్చిపోతున్నారు. ఈ దేశంలో ప్రభుత్వ సైన్యంతోబా టు బిహారులో ప్రైవేటు ఆర్మీలు ఉన్నాయి. జార్ఖండ్ చత్తీస్‌గఢ్ వంటి చాలా ప్రాంతాలకు భారత రాజ్యాంగం వర్తించకుండా చైనా చేయగలిగింది. పఠాన్‌కోటలో భారత వైమానిక దళ సిబ్బందిని ఉగ్రవాదులు కాల్చి చంపితే బహిరంగంగా ఉగ్రవాదులనే బలపరుస్తున్న వర్గాలు ఉన్న దేశం మనది. చట్టబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను లోగడ ఎన్నిసార్లు కాంగ్రెసు పార్టీ కూల్చివేయలేదు?? ఇప్పుడు నరేంద్రమోదీ ప్రభుత్వాన్ని కూల్చివేయాలని అల్లర్లు మొదలుపెట్టారు. రాజ్యాంగం మత స్వేచ్ఛను ప్రసాదించింది. కాని తమిళనాడులో రాముణ్ణి గణేశుణ్ణి పూజించకుండా ద్రవిడోద్యమ నాయకులు చేశారు. కర్ణాటకలో శివలింగాల మీద మూత్రం పోయండి- అన్న పెద్దమనిషికి మద్దతుగా యాభై మంది సోకాల్డ్ మేధావులు తమ పురస్కారాలు తిరస్కరించారు. ఇదంతా రాజ్యాంగబద్ధమేనా? మహాత్మా బసవన్న భగవద్రామానుజుడు జీవితాంతం సామాజిక సమరసతకోసం కృషిచేసిన సంస్కర్తలే. వారికి ఇవ్వాళ సమాజంలో గౌరవం ఉందా??
భారత రాజ్యాంగాన్ని అమెరికా రాజ్యంగంతో పోల్చి చూసిన నిపుణులు మనదే శ్రేష్టంగా ఉన్నదని అంగీకరించారు. గత డెబ్బది సంవత్సరాలల్లో తొంబదిసార్లు కాలానుగుణమైన మార్పులుచేర్పులు కూడా చేశారు. రాజ్యాంగం అనేది ఒక సిద్ధాంత గ్రంథం. సిద్ధాంతం ఎప్పుడైనా ఆచరించేవారి బలంమీద ఆవిష్కరింపబడుతుంది. చట్టసభలలో ఎన్నికల తర్వాత ప్రవేశించిన ప్రతినిధులు రాజ్యాంగం తమకు ప్రసాదించిన అధికారాలను విధులను నిధులను దుర్వినియోగం చేస్తే అది రాజ్యాంగం తప్పిదం ఎలా అవుతుంది?? రాంజఠ్‌మలానీ మహేష్, పాల్కీవాలా, పరాశరన్, నారిమన్ వంటి రాజ్యాంగ నిపుణులైన న్యాయకోవిదులు తమ ప్రతిభాపాటవాలలో ఎన్నో సందర్భాలల్లో రాజ్యాంగానికి చిత్రవిచిత్ర భాష్యాలు చెప్పి న్యాయస్థానాలల్లో విజయాలు సాధించారు. కాదనగలమా?? ప్రాథమిక విద్యార్హత లేనివారు పాలనాధికారాలు చేపట్టినప్పుడు సమస్యలు రావటం సహజం. స్థానిక స్వపరిపాలనా సంస్థలలో కనీస విద్యార్హత ఉండాలని హర్యానా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే దానిని అడ్డుకోవటం నిన్నటి సంఘటనే!
ప్రలోభాలు చూపి ఓట్లువేయించుకోవటం రాజ్యాంగ విరుద్ధం. అలాగే ఒక గుర్తింపు పొందిన పార్టీ గుర్తుమీద గెలిచి మరొక పార్టీకి అమ్ముడుపోవటం రాజ్యాంగ ఉల్లంఘన క్రిందికే వస్తుంది. అంతేకాదు నేరస్థులు తమ పలుకుబడి ఉపయోగించి న్యాయస్థానాలల్లో తప్పించుకున్న సందర్భాలున్నాయి. మొన్న రాజ్యాంగంమీద ప్రమాణంచేసిన బిహారు జెడియు ఎం.ఎల్.ఏ సర్ఫరజ్ ఆలం నిన్న రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో టిక్కెట్టులేకుండా ప్రమాణంచేసి తాగిన మత్తులో ఒక అబలపై అత్యాచారం చేస్తే నితీశ్‌కుమార్ ఏమీ అనలేదు. అతడు లాలూయాదవ్‌కు సన్నిహితుడూ ముస్లిం కావటం. ఇలాంటి సంఘటనలు స్వతంత్ర భారతంలో వేల సంఖ్యలో జరిగాయి. ఇవన్నీ రాజ్యాంగ ఉల్లంఘన కిందికే వస్తాయి. దీనివలన రాజ్యాంగంయొక్క ఘనత తగ్గదు. దానిని సద్వినియోగం చేసుకోవలేకపోవటం పరిరక్షించకపోవటం- వలన వస్తున్న ప్రమాదాలను మాత్రమే ఈ సంఘటనలు సూచిస్తాయి.

- ముదిగొండ శివప్రసాద్