ఉత్తరాయణం

గణతంత్ర దినం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్వాతంత్య్ర సౌరభాన్ని
భూమ్యాకాశాలను నింపిన
మహాపురుషుల నెలవు యిది
ఇది పుణ్యభూమి; సద్భావనావని
తలిదండ్రులను గౌరవించి సేవించమని
స్ర్తిలను పవిత్రంగా చూడమని
పేదా, బిక్కీ
నువ్వూ, నేనూ- అందరమూ
ఆ శంకరుని భిక్షకు పాత్రులమేనని
బోధించిన ఆదర్శభూమి
భగీరథుడు ఆకాశగంగను
భూమికి తెచ్చిన చరిత్ర మనది
హరిజనులంటూ, అంటరానివారంటూ
ఒకప్పటి మసక రోజుల్ని
నిర్మూలించిన నాగరికత మనది
శాస్త్ర ధర్మం తెలియకపోయినా
నిత్య జీవన ధర్మం తెలియాలి
సర్వాంతర్యామి అంతరాలు సృష్టించలేదలు
మన అంతరంగాలు, వికాస తరంగాలుగా మారి
వివిధ రంగాలలో ముందుకు నడిచే యాగాశ్వాలు కావాలి
నిరాశా నిశి నుండి ఆశా ఉషస్సులో
తేజో విరాజులం కావాలి
కాలంతో కమనీయంగా కలిసి మెలిసి
సృజనాత్మక కృషిచేసి
‘శరీరం మద్యం ఖలు ధర్మసాధనమని’
ప్రజలను స్పందింపజేసి
మువ్వనె్నల వెనె్నలలో
భారతమాతను వుర్రూతలూగించాలి
ఈ గణతంత్రదినం
సుగుణతంత్ర సుమధుర వీణాతంత్రీ నినాదంగా
నిత్యానంద, నిత్యకృషికి నిదర్శనంగా
నిలిచిపోవాలి
-ఎ.ఎస్.ప్రభాకర్