సబ్ ఫీచర్

ఆ గానం.. ఉరికే జలపాతం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్వర మాంత్రికుడు ఎఆర్ రెహమాన్ దృష్టిలో పడాలని.. అతని పర్యవేక్షణలో ఒక్క పాటైనా పాడాలని ఏ గాయనికి ఉండదు..? ఆ అవకాశం ఏ కొద్దిమందికో తప్ప అందర్నీ వరించదు.. అంతటి అదృష్టాన్ని దక్కించుకున్న పదహారేళ్ల అంతర నంది ఇపుడు సంగీత ప్రపంచంలో అద్భుతాలను ఆవిష్కరిస్తోంది.
పదేళ్ల ప్రాయంలోనే ‘సారేగమ లిటిల్ చాంప్స్-2009’లో తుది పోటీలో పాల్గొన్న ఆమె పేరు ఇపుడు బాలీవుడ్‌తో పాటు దక్షిణాదిలోనూ మార్మోగుతోంది. రెహమాన్‌కు అంకితం చేస్తూ అంతర విడుదల చేసిన ‘అగర్ తుమ్ సాథ్ హో’ మ్యూజిక్ వీడియో ఇపుడు సామాజిక మీడియాలో ఎంతగానో ఆకుట్టుకుంటోంది. రెహమాన్ సంగీతం అందించిన ‘తమాషా’ చిత్రంలోని ‘అగర్ తుమ్ సాథ్ హో’ ఎంతగానో ప్రేక్షకాదరణ పొందింది. రెహమాన్‌పై ఉన్న అభిమానంతో ఆ పాట పేరుమీదుగానే అంతర మ్యూజిక్ వీడియోను విడుదల చేసింది. ఆరుగురు ప్రముఖ సంగీత కళాకారులు ఈ వీడియో రూపకల్పనలో సహకరించారు. లండన్‌కు చెందిన తబలా విద్వాంసుడు నిష్ రాజ్, పియోనిస్టు కేతన్, పూణెకు చెందిన అభిషేక్ బోర్కర్, చెన్నైకి చెందిన వయోలినిస్ట్ మనోజ్ కుమార్ వంటి నిష్ణాతులు వైవిధ్య భరితమైన స్వరాలను అందించగా అంతర తన గళం విప్పింది. ఇంతమంది అనుభవజ్ఞులతో కలిసి రెహమాన్ కోసం మ్యూజిక్ వీడియోను రూపొందించడం తనకు మధురానుభూతిని కలిగించిందని ఆమె ఉబ్బితబ్బిబ్బవుతోంది. రెహమాన్ సోదరి రెహనాకు మ్యూజిక్ వీడియోను తాను పంపానని, దాన్ని ఆయన తప్పక చూసే ఉంటారని అంతర చెబుతోంది. సినిమా పాటలకే పరిమితం కావాలని భావించడం లేదని, గాన మాధుర్యం సర్వత్రా వ్యాపించాలన్న తపనతోనే తాజా వీడియోను రూపొందించామని ఆమె అంటోంది. గాయనిగా స్థిరపడేందుకు కృషి చేస్తూనే మరోవైపు చదువుపైనా దృష్టి పెడుతున్నానని అస్సాంకు చెందిన అంతర తన అంతరంగాన్ని ఆవిష్కరిస్తోంది. చెన్నైలోని ఓ ప్రముఖ సంగీత పాఠశాలలో శిక్షణ పొందుతున్న ఆమె- ‘రెహమాన్‌ను కలుసుకుంటానని కలలో కూడా ఊహించలేదు.. ఆయన ఆశీస్సులు ఆశించని గాయకులు ఎవరు ఉంటారు..?’ అంటోంది. ‘స్వరాలాపన నా ఊపిరి.. సంగీతం నుంచి ననె్నవరూ వేరుచేయలేరు.. సంగీతమే జీవితం.. నా ఆకాంక్షలకు తగ్గట్టు తల్లిదండ్రులు ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు..’ అని చెబుతోంది. ఇటీవల ఓ తమిళ సినిమాకు పాడానని, దీనికంటే ముందు ‘సన్‌రైజ్’ పేరిట తమిళ్ మ్యూజిక్ వీడియోను ‘ఫ్రెండ్‌షిప్ డే’ సందర్భంగా సంగీత ప్రియులకు అందించనున్నట్లు అంతర ప్రకటించింది. హిందుస్థానీ, క్లాసికల్, పాప్ మ్యూజిక్‌లో ప్రవేశం ఉన్న ఆమె సంగీతానికి ఎల్లలు లేవంటోంది. అస్సాంకు చెందిన తాను హిందీ, తమిళ భాషల్లో పాటలు పాడతానని ఎప్పుడూ అనుకోలేదని అంతర చెబుతోంది.
*