గ్రామీణ నేపథ్యంలో జానకిరాముడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నవీన్ సంజయ్, వౌనిక జంటగా కావేరీ ట్రావెల్స్ పతాకంపై తమ్మినేడి సతీష్‌బాబు దర్శకత్వంలో ఎంపీనాయుడు రూపొందిస్తున్న చిత్రం ‘జానకిరాముడు’. ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్ పూర్తికావస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా దర్శకుడు సతీష్‌బాబు మాట్లాడుతూ, గ్రామీణ నేపథ్యంలో అందమైన ప్రేమ కథతో ఈ చిత్రం సాగుతుందని, తొలకరి చినుకులు మట్టి పరిమళంలాంటి కథనంతో రూపొందిస్తున్నామని తెలిపారు. కథనాయకుని ప్రేమను ఎలా ఆస్వాదించింది అనే సున్నితమైన భావాలతో ఈ చిత్రం ఎలాంటి పరిణామాలకు దారితీసింది అనే కథనంతో రూపొందించామని తెలిపారు. త్వరలోనే ఆడియో విడుదల చేసి, ఈనెలలోనే విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. ‘జానకిరాముడు’ అనే అందమైన పేరుకు తగిన కథ ఈ చిత్రంలో ఉంటుందని, అందమైన లొకేషన్లలో తెరకెక్కిన ఈ చిత్రంలో అన్నివర్గాల ప్రేక్షకులను మెప్పించే ఎలిమెంట్స్ ఉంటాయని నిర్మాత ఎంపీ నాయుడు అన్నారు. శివకృష్ణ, సుధా, పవిత్ర లోకేష్, ప్రియాంక, అర్జున్, సూర్య, నల్లవేణు, కమల్, గుండు సుదర్శన్, జాకీ, కిరణ్, మీనాకుమారి, గీతాంజలి తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా:అనిత్, సంగీతం : గిఫ్టన్ అలియాస్, ఎడిటింగ్ : నాగేంద్ర అడపా, పాటలు : శ్రీమణి, అనంత శ్రీరామ్, నిర్మాత :ఎంపీ నాయుడు, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం : తమ్మినేడి సతీష్‌బాబు.