ఉత్తరాయణం

గుదిబండగా మారిన గవర్నర్ వ్యవస్థ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేంద్రం గుప్పిట్లో ఉండిపోతున్న గవర్నర్ వ్యవస్థ వల్ల ఆర్థిక భారం తప్ప లాభం లేదు. కాబట్టి రద్దు చేయడమే మంచిదన్న సిపిఐ నారాయణ మాట అక్షర సత్యం. మేధావులు, వివిధ రంగాల్లో నిష్ణాతులు ఉండవలసిన రాజ్యసభ, విధాన మండళ్లు రాజకీయ తైనాతీలు, ఎన్ని కల్లో చెల్లని ముఖాలకు స్థావరాలుగా మారిపోయాయ. వారిపై కోట్లాది రూపాయలు ఖర్చు అవుతోంది. వాళ్లు చేస్తున్న ఘనకార్యమేంటి? ప్రజలు ఎన్నుకున్న ఎంపి, ఎమ్మెల్యేలు చేసే చట్టాన్ని అడ్డుకోవడం. సభలను స్తంభింపజేయడం. ఇలా కోట్లాది ప్రజాధనం వృధా అవడమే కాక ప్రజాస్వామ్య సూత్రాలకు విఘాతం కలుగుతోంది. మరి రాజ్యసభ, విధాన మండళ్లనూ రద్దు చేయడం సమంజ సమే కదా.
- సి. మైథిలి, సర్పవరం, కాకినాడ
తెలంగాణ పట్ల సవతి తల్లి ప్రేమ
కేంద్రంలో మోదీ ప్రభుత్వం తెలంగాణ పట్ల సవతితల్లి ప్రేమ చూపుతున్నది. ఆంధ్ర ప్రదేశ్‌లో గృహనిర్మాణ పథకాలకు నిధులు కేటాయంచి తెలంగాణ కు మొండి చేయ చూపించింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 20 స్మార్ట్ సిటీల జాబితాలో తెలంగాణకు చెందిన ఒక్క నగరం కూడ లేదు. హైదరాబాద్, వరంగల్ నగరాలను కేంద్రం స్మార్ట్ సిటీలుగా ప్రకటిస్తుందని ఆశించిన తెలంగాణ ప్రజలకు నిరాశ మిగిల్చారు. అసలు తెలంగాణ అనే రాష్ట్రం ఒకటి భారతదేశంలో ఉన్నట్టు మోదీ సర్కార్ భావించడం లేదు.
- ఎస్. యాదగిరి, వనపర్తి
తప్పులెన్నువారు..
అమెరికాలో కూచుని పక్షపాత మీడియా కథనాన్ని అందిపుచ్చుకొని హ్యూమన్ రైట్స్ వాచ్, అమ్నెస్టీకి చెందిన పెద్దన్నగారి బంట్లు భారత్‌లో మైనారిటీలపై దాడులు జరుగుతున్నాయని విమర్శకులపైన, భావ ప్రకటనా స్వేచ్ఛపైన ఆంక్షలు విధిస్తున్నారంటూ తీర్పు చెప్పేశారు. మరి ఈ సంఘాల పుట్టిల్లులోనే ఒకడు స్కూ లు పిల్లల మతం అడిగి, ఒక మతానికి చెందిన పిల్లల్ని కాల్చి చంపినప్పుడు, ఎందుకు నోరెత్తలేదు? పాక్, బంగ్లా దేశ్‌లనుంచి హిందూ మైనారిటీలను వెళ్లగొడుతున్నప్పు డు ఈ పెద్దలేం చేస్తున్నారు?
- పి. శాండిల్య, కాకినాడ
దేశభక్తిని చాటింది
‘అమ్మసేవలో అమరుడు’ శీర్షికన ఫిబ్రవరి 12న ప్రచురితమైన సంపాదకీయంలో ప్రతి వాక్యం వీరరసాన్ని విస్ఫోటిస్తోంది. దేశంలోని ఏ ఇతర పత్రిక అయనా దేశభక్తిని ఇంతకన్నా బాగా రగుల్పొల్పగలదని నేననుకోను. అభినందనలు.
-గుండు సుబ్రహ్మణ్య దీక్షితులు, ఏలూరు
ఎన్‌ఏడి వద్ద ఓవర్ బ్రిడ్జి నిర్మించాలి
పూర్వం విశాఖపట్టణంలోని కాంప్లెక్స్ వద్ద ఓవర్ బ్రిడ్జి ఉండేది కాదు. అప్పుడు వాహనాలు అతి సులువుగా వెళ్లేవి. కాంప్లెక్స్ నుంచి దాదాపు రైల్వే స్టేషన్ వరకు అమితంగా ఖర్చు పెట్టి ఓవర్ బ్రిడ్జి ఎందుకు కట్టారో గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ వారికి, ప్రభుత్వానికే తెలియాలి. ఏ బస్సు కూడా ఈ దారిపై ప్రయాణించగా ఎవరూ చూడలేదు. ఎన్‌ఏడి వద్ద ట్రాఫిక్ రద్దీ ఎక్కువై ప్రజలు నానా అగచాట్లు పడుతున్నారు. పెద్ద రాజకీయ నాయకులు లగ్జరీ బస్సులలో, రైళ్లలో ఫస్ట్ క్లాస్‌లో, విమాన ప్రయాణాలు మాత్రమే చేస్తారు. వారికి కాంప్లెక్స్ దగ్గర ఓవర్‌బ్రిడ్జి అవసరం అవుతుంది. ఎన్‌ఏడి దగ్గర వారు ప్రయాణించరు కనుక అవసరం లేదా? ప్రజల దుస్థితిని గమనించి అక్కడ అడ్డు పడుతున్న కుహనా రాజకీయాలను పక్కన పెట్టి శీఘ్రగతిని ఎన్‌ఏడి వద్ద ఓవర్ బ్రిడ్జి, వీలైతే సబ్‌వే ఏర్పాటు చేయాలని మనవి.
- పట్టిసపు శేషగిరిరావు, విశాఖపట్టణం
పారదర్శకత లేని నియామకాలు
ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో పారదర్శకత, స్పష్ఠత లోపిస్తున్నది. ఉద్యోగ నియామక ప్రక్రియలో ప్రభుత్వ విధానం రాను రాను మోసపూరితంగా మారుతోంది. ప్రస్తుతం ఉద్యోగ నియామకాల్లో ఏవిధమైన నిబంధనలు పాటించడం లేదు. చివరకు నియామకాలపై నోటిఫికే షన్లు కూడా జారీ చేయడం లేదు. కొన్ని సందర్భాల్లో నియామక పరీక్షలు నిర్వహించినా అర్థాంతర న్యాయ పరమైన చిక్కులు, లొసుగులతో ఉంటున్నాయ. ఇక ఇటువంటి నియామకాలకు సంవత్సరాలు పడుతోంది. మరికొన్ని సందర్భాల్లో ఫలితాలు ప్రకటించి గుట్టుగా నియామకాలు జరుపుతున్నారు. ప్రభుత్వం ఉద్దేశ పూర్వ కంగానే నిరుద్యోగులతో చెలగాటమాడు తోంది. వీటికి తోడు ఉన్న ఉద్యోగాలకు కోత విధించడం, ప్రత్యక్ష నియామకాలు జరపకపోతుండటం వల్ల నిరుద్యోగుల సంఖ్య పెరిగిపోతున్నది. కాంట్రాక్టు పద్ధతి నియామ కాలతో నిరుద్యోగులను నిలువునా ముంచుతున్నారు. అందువల్ల ప్రభుత్వాలు వార్షిక పట్టికకు అనుగుణంగా చట్టపరమైన చిక్కులు, లొసుగులకు తావులేని విధంగా నియామకాలు జరపాలి.
- డి. చాంద్ పాష, కర్నూలు
మన గోతిని మనం తీసుకున్నట్లే
ప్రభుత్వ ఆస్తిని తగలబెట్టడమంటే మనగోతిని మనం తవ్వుకున్నట్టే. రైల్వే ఆస్తులను తగులబెట్టడం వల్ల, రేపు బడ్జెట్‌లో ధరలు పెంచి నష్టాన్ని పూడ్చుకోవడానికి ప్రభుత్వం యత్నిస్తుంది. పెంచిన ధరలు మన నెత్తినే కదా పడేది. స్వార్థంతో ఇటువంటి పనులను చేసేవారిని ప్రజలు క్షమించరు. తగలబడుతున్న రైలును చూస్తూ ఎంతో మంది శాపనార్థాలు పెట్టారు. నాడు రైలులో ప్రయాణిం చిన వారు ఎన్ని ఇబ్బందులు పడ్డారో కదా. కుల రిజర్వే షన్ల ఉద్యమానికి రైళ్లకేంటి సంబంధం? ప్రయాణికులు ఏం పాపం చేశారు?
- చిట్టా లోకపావని, విజయవాడ